రజనీకాంత్ వైపు అడుగులు వేస్తున్న నాని !

Seetha Sailaja
న్యాచురల్ స్టార్ నాని కి ‘దసరా’ ఘనవిజయం మంచి జోష్ ను ఇచ్చింది.  ప్రస్తుతం నాని నటిస్తున్న ‘హయ్ నాన్న’ మూవీ నానికి కలిసివచ్చే క్రిస్మస్  సీజన్ లో రాబోతోంది. ఈ సినిమాకు మంచి బిజినెస్ కూడా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా వెంకటేష్ నితిన్ ల సినిమాలతో పోటీ పడుతున్న నేపధ్యంలో ఈ వార్ లో నాని విజయం సాధిస్తే మీడియం రేంజ్ హీరోలలో నాని నెంబర్ వన్ పొజిషన్ కు చేరిపోవడం ఖాయం అన్న సంకేతాలు వస్తున్నాయి.  


‘వి’ సినిమా పరాజయం తర్వాత కథల విషయంలో నాని జాగ్రత్తగా ఉంటున్నట్లు  తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య నానీ కి తమిళ ఫిలిమ్ ఇండస్ట్రి నుండి వచ్చిన ఒక ఆఫర్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇండస్ట్రి వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం రజనీకాంత్ నటించబోయే 170వ సినిమాలో నానికి ఒక కీలక పాత్రను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ‘జై భీమ్’ మూవీతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న టిజె జ్ఞానవేల్ దర్శకత్వంలో త్వరలో సెట్స్ పైకి వెళ్ళ బోతున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ కూడా నటించ బోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

దశాబ్దాల క్రితం దేశాన్ని కుదిపేసిన ఒక ఎన్ కౌంటర్ ఆధారంగా ఈ మూవీ కథ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సంచలనాలు  సృష్టించిన ‘జై భీమ్’ మూవీలా ఈ కధలో కూడా సున్నితమైన అంశాలు ఉంటాయని  తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు చాలవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ ‘జైలర్’ రిలీజ్ అయ్యాక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.  

ఈవార్తలే  నిజం అయితే నాని కెరియర్ లో ఈ మూవీ లాండ్ మార్క్  గా మారే ఆస్కారం ఉంది. నానీకి తెలుగు ప్రేక్షకులలో చాలమంచి ఇమేజ్ ఉంది. ఇప్పుడు ఈసినిమాతో అతడి రేంజ్ పాన్ ఇండియా హీరోగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: