అంతర్మధనంలో ఆదికేశవ !
ప్రతి శుక్రవారం మారిపోయే మీడియం రేంజ్ హీరోల జాతకాలు ప్రస్తుత పోటీ వాతావరణంలో ఎక్కువ ఫ్లాపులు పడితే ఎంత మెగా కాంపౌండ్ హీరోకు అయినా కష్టకాలమే. ఈ పరిస్థితుల మధ్య ఈయంగ్ హీరో నటించిన ‘ఆదికేశవ’ ఆగస్ట్ 18న విడుదల కావలసి ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అన్న ప్రచారం జరుగుతోంది.
దీనికి చాలాకారణాలు కనిపిస్తున్నాయి మొదటిగా చిరంజీవి ‘భోళా శంకర్’ ఈసినిమా విడుదలకు వైష్ణవ్ తేజ్ సినిమా విడుదలకు కేవలం ఒక్క వారం మాత్రమే గ్యాప్ ఉండే పరిస్థితులలో మెగా స్టార్ మ్యానియా ముందు వైష్ణవ్ తేజ్ సినిమా నిలబడటం కష్టం అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇది చాలదు అన్నట్లుగా అనుష్క నవీన్ పోలిశెట్టి ల ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ని ఆగష్టు 18న విడుదల చేసే ఆలోచనలు జరుగుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల మధ్య ‘ఆది కేశవ’ వాయిదా వేయడం మంచిది అన్న ఉద్దేశ్యం ఈమూవీ నిర్మాతలకు ఏర్పడినట్లు తెలుస్తోంది. దీనికితోడు ఈసినిమా పట్ల పెద్దగా క్రేజ్ కూడ యూత్ లో ఏర్పడక పోవడం మరొక మైనస్ పాయింట్ గా కనిపిస్తోంది అని అంటున్నారు. ఈసినిమాకు సంబమహించి ఒక్క చిన్న టీజర్ మినహా మ రేది రాకపోవడంతో ఈమూవీ గురించి పెద్దగా అంచనాలు లేవు. అయితే ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శ్రీలీల మ్యానియాను నమ్ముకుని ఈమూవీని అనుకున్న తేదీకి విడుదల చేస్తారా అన్న సందేహాలు కూడ కొందరిలో ఉన్నాయి..