విజయ యాత్ర సందర్భంగా ఈ రోజు ఆ ప్రాంతాలను సందర్శించనున్న "బ్రో" మూవీ యూనిట్..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా కొంత కాలం క్రితం అజ్ఞాతవాసి మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొన్న పవన్ ఆ తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకొని హిందీలో మంచి విజయం సాధించినటువంటి పింక్ సినిమాను తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమిక్ చేసి మంచి విజయం సాధించాడు. అలాగే ఆ తర్వాత మలయాళంలో మంచి విజయం అందుకున్న అయ్యప్పనున్ కోషియన్ అనే సినిమాను భీమ్లా నాయక్ అనే పేరుతో తెలుగులో రీమేక్ చేసి మరో విజయాన్ని అందుకున్నాడు.
 


ఇకపోతే తాజాగా తమిళ సినిమా వినోదయ సీతం కు రీమేక్ గా రూపొందిన బ్రో సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా హీరోగా నటించాడు. సముద్ర కని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా ... పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ... జీ స్టూడియో వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇకపోతే ఈ సినిమా జులై 28 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యి మంచి టాక్ ని తెచ్చుకొని అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ విజయ యాత్ర అనే పేరుతో ఆగస్టు1 వ తేదీన కొన్ని ప్రాంతాలను పర్యటించబోతుంది. అవి ఏమిటో తెలుసుకుందాం.


ఈ మూవీ యూనిట్ ఆగస్టు 1 వ తేదీన ఉదయం 9 గంటలకు విజయవాడలోని కనకదుర్గ టెంపుల్ ను పర్యటించబోతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు తెనాలిలోని సంగమేశ్వర థియేటర్ ను ... ఆ తర్వాత మధ్యాహ్నం 1: 30 కి గుంటూరులోని సరస్వతి థియేటర్ కు ... ఆ తర్వాత సాయంత్రం 4:30 గంటలకి విజయవాడలోని జయరాం థియేటర్ ను ... ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు "పివిపి" మాల్ ను పర్యటించబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: