డేంజర్ జోన్ లో ఉన్న చిరంజీవి భోళా శంకర్.. అదే కారణమా..!?

Anilkumar
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరియు మెహర్ రమేష్ కాంబినేషన్లో వస్తున్న భోళా శంకర్ సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదల కావడానికి సిద్ధంగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా తమిళంలో వచ్చిన వేదాలను సినిమా కి రీమేక్ గా తెరకెక్కుతోంది. తమిళంలో స్టార్ హీరో అజిత్ ఈ సినిమాలో హీరోగా నటించారు. అన్నాచెల్లెల సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.  ఇక తెలుగులో కొద్దిగా మార్పులు చీరలు చేసి ఈ సినిమాని భోళా శంకర్ గా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పాటలను విడుదల చేశారు చిత్ర బృందం. 


దాంతోపాటు ట్రైలర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ మరియు పాటలకి ఇప్పటికే మంచి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.  కానీ మూలా శంకర్ పోయి రిలీజ్ బిజినెస్ మాత్రం చాలా వీక్ గా జరుగుతుంది అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.  అయితే ఇప్పటికే భోళా శంకర్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి అయితే ఓవర్సీస్ లో ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ లో ఇప్పటికీ 11, డాలర్లు మరియు రెండు తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్ల మీద బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది.


ఇక చిరంజీవి సినిమాలకి సంబంధించి ఇది చాలా చిన్న బిజినెస్ అని అంటున్నారు. దీంతో ఈ వార్తపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక మెహర్ రమేష్ కి సరైన హిట్ లేకపోవడంతో పాటు రీమేక్ సినిమా కావడంతో బయ్యర్లు సైతం భోళా శంకర్ సినిమాని చాలా లైట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇటీవల చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 140 కోట్లకు జరిగింది. దాంతో పోలిస్తే భోళా శంకర్ సినిమా సగం కూడా దాటలేదు. దీంతో నిర్మాతలు టెన్షన్ పడుతున్నారని చెప్పాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: