హీరో 'రామ్' ఆ హీరోయిన్ కి ఫ్లవర్ బొకే పంపడానికి కారణం....??
బేబీ విడుదలైన నాటి నుంచి టాలీవుడ్ లో వైష్ణవి చైతన్య పేరు మారుమోగిపోతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజాగా వైష్ణవి చైతన్య ఓ బంపర్ ఆఫర్ కొట్టేసింది. రెండో సినిమానే ఓ స్టార్ హీరోతో చేయబోతోంది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు..ఉస్తాద్ రామ్ పోతినేని. బోయపాటి దర్శకత్వంలో `స్కంద` పూర్తి చేసిన రామ్.. ఇప్పుడు పూరీ జగన్నాథ్ తో `డబుల్ ఇస్మార్ట్`ను పట్టాలెక్కించాడు.
బ్లాక్ బస్టర్ మూవీ `ఇస్మార్ట్ శంకర్`కు సీక్వెల్ ఇది. ఇటీవలె ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా చేస్తున్నాడు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. అయితే ఒక హీరోయిన్ గా వైష్ణవి చైతన్యను ఎంపిక చేశారని అంటున్నారు. బేబీలో వైష్ణవి నటన పూరీని బాగా ఆకట్టుకుందట.ఈ నేపథ్యంలోనే ఆమెను ఒక హీరోయిన్ గా తీసుకున్నారని టాక్ నడుస్తోంది. ఇటీవల వైష్ణవికి రామ్ పెద్ద ఫ్లెవర్ బొకేను పంపాడు. అయితే అది బేబీ మూవీ సక్సెస్ అయినందుకు మాత్రమే కాదు.. డబుల్ ఇస్మార్ట్ లో హీరోయిన్ గా ఎంపిక అయినందుకు కూడా అని అంటున్నారు.