రజనీకాంత్ ప్రభు జ్యోతిక నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి సినిమాలో అప్పటిలో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రజినీకాంత్ కి ఈ సినిమా మంచి హిట్ ఇచ్చి మళ్లీ ఫామ్ లోకి తెచ్చింది. ఇక ఈ సినిమాకు ఎంత క్రిస్ అంటే ఇప్పటికీ టీవీలో వస్తే అదే ఎనర్జీతో టీవీలకి అతకపోతుంటారు సినీ లవర్స్. 2005లో విడుదలైన ఈ సినిమాని పి వాసు దర్శకత్వంలో వచ్చింది. దీనికి సీక్వెల్ చేయాలని ఆయన ఎప్పటినుండో ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోని రజినీకాంత్ ఒప్పుకోకపోవడంతో సీక్వల్ కథలో
తెలుగులో నాగవల్లి సినిమాని చేయడం జరిగింది. ఇక ఇన్నాళ్లకు అంటే దాదాపు 18 ఏళ్ల తర్వాత తమిళంలోనూ చంద్రముఖి 2 సినిమాని తీయడం జరిగింది. ఇందులో రజినీకాంత్ కి బదులుగా నటుడు లారెన్స్ నటించారు. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనత్ ప్రధాన పాత్రలో నటించిన వడివేలు రాధిక ముఖ్య పాత్రలో పోషించడం జరిగింది. అయితే ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. తాజాగా ఇప్పుడు సినిమా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు చిత్ర బృందం.
అయితే ఆ ఫస్ట్ లుక్ చూసిన వాళ్ళందరూ తెగ భయపడుతున్నారు. సీక్వెల్ కు ఫస్ట్ లుక్ ల లేదని ఏదో చంద్రముఖికు స్పోఫ్ తీస్తున్నట్లు ఉంది అని చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. రజినీలా లారెన్స్ నడిచి రావడాన్ని తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక చంద్రముఖి 2 తెలుగు తమిళ హిందీ మలయాళ కన్నడ భాషల్లో వినాయక చవితి సందర్భంగా విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు చిత్ర బృందం. సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ కమెడియన్ వడివేలు ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మహిమ నంబియా లక్ష్మీ మీనన్ సృష్టి డాంగే తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు..!!