ఏంటి.. సమంత మరోసారి ప్రేమలో పడిందా?
దీంతో అప్పటి నుంచి సమంత సినిమాల గురించి మాట్లాడుకునే వారు తక్కువయ్యారు. కేవలం విడాకుల గురించి మాట్లాడుకునే వారే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే సమంత విడాకులు తీసుకొని ఏడాది గడుస్తున్నా ఇంకా ఈ విషయం గురించి సోషల్ మీడియాలో ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంది అని చెప్పాలి. అయితే విడాకుల తర్వాత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సమంత ఇప్పుడు సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకొని ఈ వ్యాధి నుంచి కోలుకునే పనిలో నిమగ్నమైంది అని చెప్పాలి. అయితే ఇప్పుడు సమంతకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. సమంత మరోసారి ప్రేమలో పడిందేమో అంటూ అందరూ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి.
ఎందుకంటే ఇటీవల కాలంలో సమంత ప్రేమకు సంబంధించిన స్టేటస్ లను ఎక్కువగా పెడుతూ ఉండడం గమనార్హం. ఇటీవల పెట్టిన మరో స్టేటస్ వైరల్ గా మారిపోయింది. ద్వేషించే మనుషులు మాటలు చూసి ఉంటారేమో.. కానీ ఈ ప్రపంచంలో మనం ఊహించిన దాని కంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది అంటూ ఒక కొటేషన్ పిక్ ని షేర్ చేసింది సమంత. ఇలా తరచూ ప్రేమకు సంబంధించి ఏదో ఒక కొటేషన్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉండడం గమనార్హం. దీంతో సమంతా మరోసారి ప్రేమలో పడింది అని అనుమానాలు తెరిమితికి వస్తున్నాయి. ఇక అజ్ఞాత వ్యక్తి ఎవరై ఉంటారా అనే ప్రస్తుతం అభిమానులు అందరూ కూడా కన్ఫ్యూషన్ లో పడిపోయారు అని చెప్పాలి.