రకుల్ ప్రీత్ సింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి...!!
ఇదంతా పక్కన పెడితే ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో డివోర్స్ చాలా కామన్ నచ్చితే కలిసుందాం లేకపోతే విడిపోతాం అనే విధంగా మారిపోయారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఆ స్టార్ హీరోయిన్ పెళ్లి జరిగితే కూడా కచ్చితంగా విడాకులే అంటూ వేణు స్వామి షాకింగ్ కామెంట్లు చేశారు.అయితే గతంలోనే వేణు స్వామి ఆ హీరోయిన్ పెళ్లి గురించి సంచలన కామెంట్స్ చేశారు. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు పొడుగు కాళ్ళ సుందరి పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ .ఈ హీరోయిన్ ఈమధ్య కాలంలో బాలీవుడ్ నటుడు నిర్మాత అయిన జాకీ భగ్నానితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. ఇక మరికొద్ది రోజుల్లోనే వీరికి పెళ్లి కూడా జరగబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మరోసారి వేణు స్వామి ఈ హీరోయిన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇప్పటికే నేను ఆ హీరోయిన్ పెళ్లి జీవితం అంతగా కలిసి రాదు అని చెప్పాను.
అలాగే ఆయనతో ప్రేమలో పడ్డప్పటి నుండి రకుల్ ప్రీత్ సింగ్ కెరియర్ ఎలా ఉందో మీకే అర్థమవుతుంది. ఆమె కి ఎలాంటి అవకాశాలు కూడా రావడం లేదు.ఇక రకుల్ ప్రీత్ సింగ్పెళ్లి చేసుకుంటే మాత్రం సమంత లాగే ఆమె కెరియర్ కూడా డల్ అవుతుంది. చివరికి విభేదాలు వచ్చి విడిపోవడం పక్కా అని బలగుద్దినట్లు చెప్పారు.అయితే ఈయన మాటలు కొంతమంది నిజమే అంటే మరి కొంతమంది కొట్టి పారేస్తున్నారు. అయితే గతంలో సమంత నాగచైతన్య విషయంలో ఇలాగే చెబితే చాలామంది ఆయనను తిట్టుకున్నారు. కానీ చివరాకరికి సమంత నాగచైతన్య నాలుగు సంవత్సరాలు కూడా కలిసి ఉండలేక విడాకులు తీసుకొని వేణు స్వామి చెప్పిన మాటలే నిజం చేశారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ జీవితం కూడా సమంత లాగే ఉండబోతుంది అని కొంతమంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.