ఆగడు చిత్రం ప్లాప్ అవ్వడానికి కారణం ఇదే.. నిజం బయటపెట్టిన శ్రీను వైట్ల?
"మహేష్ ఫాన్స్ దూకుడు చిత్రం తరువాత తమ హీరో తో మంచి మాస్ సినిమా తీయమని అడిగారు. కానీ నా స్టైల్ అది కాదు. నేని మాస్ డైరెక్టర్ని కాదు. ఆగడు చిత్రాన్ని సల్మాన్ ఖాన్ టైగర్ జిందా హాయ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నాను. కానీ ఆగడు నిర్మాతలు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్లకి అప్పటికే ఒక ప్లాప్ ఉంది. కనుక వాళ్ళు రిస్క్ తీసుకోకుండా ఒక పల్లెటూరు బ్యాగ్రౌండ్ లో మహేష్ ని సింపుల్ గా చూపించి తియ్యమన్నారు. నేను కూడా వాళ్ళ కోరికల మేరకు కథను మార్చి పల్లెట్టారులో కథ ఉండేలా డిజైన్ చేశాను. మహేష్ స్టైల్ ని టాలెంట్ ని హైలైట్ చేసేలా బ్రెత్ లెస్ డైలాగ్స్ కామెడీ పంచెస్ అన్ని రాసాను. కానీ ఏవి వర్క్ అవుట్ అవ్వలేదు. సినిమా ప్లాప్ అయ్యింది. కానీ ఈ సినిమా ప్లాప్ కి మహేష్ బాబు నన్ను ఎప్పుడు నిందించలేదు. సినిమాకు ముందు, సినిమా తరువాత నా పట్ల అతని ప్రవర్తన మారలేదు" అని చెప్పుకొచ్చారు శ్రీను వైట్ల.