ఏంటి.. ధోని భార్య.. ఆ టాలీవుడ్ హీరోకి వీరాభిమానా?
అయితే ధోని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అటు ఐపిఎల్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా మాత్రం ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపిఎల్ సీజన్లో ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిపి మరోసారి తన కెప్టెన్సీ సత్తా ఏంటో చాటాడు మహేంద్ర సింగ్ ధోని. అయితే ఇక ఇప్పుడు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో ఉన్న ధోని కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా సినిమాలను నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. ధోని ఎంటర్టైన్మెంట్ అంటూ ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించాడు.
ఈ క్రమంలోనే లెట్స్ గెట్ మ్యారీడ్ అనే ఒక సినిమాను నిర్మించాడు. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు అని చెప్పాలి. ఆగస్టు 4వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ధోని భార్య సాక్షి హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలుగు సినిమాలు నేను చూస్తూనే ఉంటాను. ముఖ్యంగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కు నేను పెద్ద అభిమానిని.. ఆయన నటించిన ప్రతి సినిమాను చూశాను అంటూ సాక్షి తెలిపింది.