బ్రో సినిమా టికెట్ల రేట్ల పరిస్థితి అంతేనా..?

Divya
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,సాయి ధరంతేజ్ కీలకమైన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం బ్రో ఈ సినిమా ఈనెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ఈ చిత్రాన్ని సముద్రఖని దర్శకత్వం వహించారు.ఇందులో కేతిక శర్మతో పాటు ప్రియా వారియర్ కూడా నటిస్తోంది. అయితే ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ ను చిత్ర బృందం వేగవంతం చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ మధ్యకాలంలో ఎలాంటి హీరోల సినిమాలైనా సరే మొదటి వారం రోజులు లేకపోతే 10 రోజులలోపే కలెక్షన్లను సంపాదించాల్సి ఉంటుంది.

ఎందుకంటే ఆ సమయంలో టికెట్ల రేట్లు అమాంతం పెంచే అవకాశం కల్పించింది రెండు రాష్ట్రాలలోని ప్రభుత్వం. కానీ పవన్ కళ్యాణ్ సినిమాకు మాత్రం ఆ వెలుసుబాటు ఉందా లేదా అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. తెలంగాణలో సినిమా రేట్లు పెంచేందుకు నిర్మాతలకు ప్రభుత్వం ఓకే చెప్పినా ఏపీలో మాత్రం రాజకీయ కోణాలతో బ్రో సినిమా టికెట్ల రేట్లు పెంచే అవకాశాలు కనిపించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.. భారీ అంచనాల నడుమ ఈ సినిమా 100 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందించినట్లు తెలుస్తోంది.

కనుక మొదటి వారం రోజులు టికెట్ల రేటును పెంచితే నిర్మాతలకు లాభంతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు కూడా లాభం వచ్చే అవకాశం ఉంది.. మరి బ్రో సినిమాకు ఏపీ ప్రభుత్వం అందుకు సహకరిస్తుందా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల వల్ల ఏపీ ప్రభుత్వం చాలా కఠినమైన వ్యవహారాలను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మొత్తానికి బ్రో సినిమా రాజకీయపరంగా ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: