పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ మరియు సాయి ధరంతేజ్ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్
మూవీ బ్రో ది అవతార్. అయితే ఈ
సినిమా మరో వారం రోజుల్లో విడుదల కావడానికి రెడీగా ఉంది. దీంతో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చిత్రబంధం. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ సైతం చాలా ప్రాంతాల్లో స్టార్ట్ అయ్యాయి. ట్రైలర్ లేకుండానే టికెట్ కదలని ఓవర్సీస్ లాంటి ప్రాంతాలలో కేవలం పవన్
కళ్యాణ్ ఇమేజ్ తో అడ్వాన్స్ బుకింగ్స్ అంతంతో మాత్రమే జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
అయితే ముఖ్యంగా ఈ
సినిమా రీమేక్ సినిమాగా పిలవడంతో పాటు ఈ సినిమాలోని పాటలు కూడా పెద్దగా బాగుండకపోవడంతో బుకింగ్స్ పెద్దగా జరగడం లేదన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒకవేళ ఈ
సినిమా ట్రైలర్ విడుదలయితే గనక ట్రైలర్ బావుంటే మంచి బుకింగ్స్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇదంతా ఇలా ఉంటే బ్రో సినిమాకి రాబోయే రోజుల్లో చాలా అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు సైతం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ
సినిమా విడుదల సమయానికి మూడు
హాలీవుడ్ సినిమాలు విడుదలవుతున్నాయి.
బీసీ సెంటర్లో ఈ ప్రభావం ఉండదు.
కానీ
హైదరాబాద్ బెంగళూరు తదితర ప్రాంతాల్లో మాత్రం ఈ సినిమాపై
హాలీవుడ్ సినిమాల ప్రభావం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇటీవల విడుదలైన బేబీ
సినిమా సైతం ప్రస్తుతం కలెక్షన్ల పరంగా
సునామీ సృష్టిస్తుంది. మరో రెండు వారాల వరకు ఈ
సినిమా బస్సుల్లో గట్టిగానే ఉండేటట్లుగా కనిపిస్తున్నాయి. అయితే విడుదలైన అన్ని ప్రాంతాల్లో సైతం ఈ
సినిమా ప్రభావం బ్రో సినిమాపై ఉండే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. బ్రో
సినిమా యుఎస్ లో అయితే అక్కడ ఓపెన్ హెయిర్, మిషన్ ఇంపాజిబుల్, బార్బీ వంటి చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ సినిమాలన్నీ కూడా బ్రో సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది..!!