"బ్రో" మూవీలో నాకు పవన్ తో ఎలాంటి సన్నివేశాలు లేవు... కేతికా శర్మ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటీ మణులలో ఒకరు అయినటు వంటి కేతికా శర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా రూపొందిన రొమాంటిక్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయం సాధించినప్పటికీ ఈ మూవీ లో కేతిక మాత్రం తన హాట్ హాట్ అందం చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తన అందచందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి టాలీవుడ్ కుర్రకారు ప్రేక్షకుల మనసు దోచుకుంది.


దానితో ఈ ముద్దు గుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుసగా అవకాశాలు దక్కాయి. దానితో ఇప్పటికే ఈ ముద్దు గుమ్మ అనేక తెలుగు సినిమాలలో నటించి ఫుల్ క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోలుగా సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందిన "బ్రో" అనే సినిమాలో సాయి తేజ తరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ జూలై 28 వ తేదీన విడుదల కాబోతోంది.


ఇది ఇలా ఉంటే తాజాగా "బ్రో" సినిమా గురించి ఈ ముద్దు గుమ్మ మాట్లాడుతూ ... నాకు పవన్ కళ్యాణ్ కు మధ్య ఈ సినిమాలో ఎలాంటి సన్నివేశాలు లేవు. నేను ఈ సినిమాలో సాయి తేజ్ లవర్ పాత్రలో కనిపించబోతున్నాను. నాకు ఈ సినిమాలో త్రివిక్రమ్ చాలా మంచి డైలాగులు రాశాడు. అవి చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి అని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: