
పాపం.. బన్నీ హీరోయిన్ కు ఎంత కష్టం వచ్చింది?
ఇలా మొదటి సినిమా చేసింది చిన్న హీరోతో అయినా ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటూ ఉంటారు అని చెప్పాలి. కానీ కొంతమంది హీరోయిన్ల విషయంలో మాత్రం ఇదంతా రివర్స్ అవుతూ ఉంటుంది. మొదటి సినిమానే స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసినప్పటికీ.. అటు తర్వాత మాత్రం ఇండస్ట్రీలో కనిపించకుండా పోతూ ఉంటారు. హీరోయిన్లు నటించాలని ఉన్న అవకాశాలు లేక ఇక ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. అలాంటి వారిలో భాను శ్రీ మెహ్ర కూడా ఒకరు. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. వరుడు అనే సినిమాలో బన్నీతో రొమాన్స్ చేసింది.
ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే గుణశేఖర్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా చివరికి ప్రేక్షకులను మెప్పించలేక ఫ్లాప్ గానే మిగిలిపోయింది. ఇలా మొదటి సినిమాతోనే డిజైన్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇటీవల అల్లు అర్జున్ తనను సోషల్ మీడియాలో బ్లాక్ చేశారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి వార్తల్లో నిలిచింది. సినిమాల్లో అవకాశాలు వస్తాయేమో అని ఎదురుచూస్తున్నాను అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టగా.. వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసి పాపం బన్నీ హీరోయిన్ కు ఎంత కష్టం వచ్చిందో అంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్.