నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో భారీ స్కెచ్ వేసిన చిరంజీవి..!
సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తున్న ఈయన సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకొని ఆచార్య సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. అయితే ఈ సినిమా పూర్తిగా డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత గాడ్ ఫాదర్ మూవీ తో వచ్చి మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్నాడు. కానీ అందుకు తగ్గట్టుగా వసూలు రాలేదు. ఇక ఇదే సంవత్సరం వాల్తేరు వీరయ్య సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి ఊచకోత కోశాడని చెప్పాలి. ఇక ఈ సినిమా ఇచ్చిన ఊపుతోనే ఆయన మరిన్ని సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమా చేస్తున్నారు.
ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదల కాబోతోంది.
మరొకవైపు బింబిసారాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నారు చిరంజీవి. ఇకపోతే తాజాగా ఈయన మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలయ్య, రామ్ చరణ్ వంటి హీరోలతో కూడా తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ లను చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా చిరంజీవి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం భారీ స్కెచ్ వేశారని చెప్పవచ్చు.