2023:టాలీవుడ్ లో అత్యధిక లాభాలు వచ్చిన చిత్రాలు ఇవే..!!

Divya
టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో సినిమాలు ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాయి.. ముఖ్యంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా సినిమా స్టోరీ పరంగా బాగుంటే ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అలా ఏడాది మొదటినుంచి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు విడుదలై ప్రేక్షకులను బాగా అలరించాయి ఈ ఏడాది ఇప్పటివరకు విడుదలైన చిత్రాలు ఏ మేరకు సక్సెస్ అయ్యాయి వాటి గురించి తెలుసుకుందాం.


ఈ ఏడాది టాలీవుడ్ లో ఒక్క ప్రాంతంలో బ్రేక్ ఈవెన్ సాధించి అత్యధిక లాభాలు పొందిన చిత్రాలలో చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా ముందు వరుసలో ఉందని చెప్పవచ్చు. ఆ తర్వాత ధనుష్ నటించిన సార్ సినిమా కూడా మంచి విజయాలను అందుకుంది. ఇక మొదట జబర్దస్త్ కమెడియన్క మంచి పాపులారిటీ సంపాదించిన వేణు వండర్ బలగం సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలంగాణలో బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచిందని చెప్పవచ్చు. హీరో సాయి ధరంతేజ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం విరుపాక్ష. ఈ చిత్రం తన కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్ల రాబట్టిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.


ఇక చిన్న సినిమాలలో తాజాగా విడుదలైన సామజ వరగమన సినిమా కూడా నటుడు శ్రీ విష్ణు కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలవడమే కాకుండా సాధించి శ్రీ విష్ణు కెరియర్ లోని ఒక మంచి బ్రేకులు తీసుకువచ్చిందని చెప్పవచ్చు. ఇటీవలే విడుదలైన విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ చిత్రం బేబీ ఈ సినిమా కూడా కలెక్టర్ బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచింది. ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాలలో ఇవన్నీ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలు ఈ జాబితాలోకి చేరుతాయేమో చూడాలి మరి. ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలు ఇవే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: