"హిడింబా" మూవీ కి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
ప్రముఖ యాంకర్ ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన రాజు గారి గది మూవీ తో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న అశ్విన్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజు గారి గది మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం ... అలాగే ఈ మూవీ లో అశ్విన్ తన డీసెంట్ నటనతో ప్రేక్షకులను అలరించడంతో ఈ మూవీ ద్వారా ఈ నటుడు కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ నటుడు కి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి కొన్ని క్రేజీ సినిమాలలో అవకాశాలు కూడా దక్కాయి.
 


ఇకపోతే ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ నటుడు తాజాగా హీడింబా అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ నటిమని నందిత శ్వేతా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో అశ్విన్ మరియు నందిత శ్వేతా లు ఇద్దరు కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ని జులై 20 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.


ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్ లను ఓపెన్ చేసింది. ఈ విషయాన్ని ఈ మూ వీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇకపోతే ఈ సినిమాకు అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: