ఆ బాలీవుడ్ సినిమాను.. రీమేక్ చేయబోతున్న రవితేజ?

praveen
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రవితేజ ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ధమాకా అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రవితేజ ఆ తర్వాత భారీ అంచనాలతో రావణాసుర అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇకపోతే ప్రస్తుతం మరికొన్ని సినిమాల షూటింగ్లలో బిజీబిజీగా ఉన్నాడు అని చెప్పాలి. ఇదిలా ఉంటే రవితేజ ఓ క్రేజీ డైరెక్టర్ తో మరో సినిమా ఒప్పుకున్నాడట.


 ఆ క్రేజీ డైరెక్టర్ ఎవరో కాదు.. హరీష్ శంకర్. ప్రస్తుతం హరిష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నాడు హరీష్ శంకర్. అయితే ఇప్పుడు తనకు అచ్చొచ్చిన హీరోగా ఉన్న రవితేజ తో ఒక సినిమాకు సిద్ధమవుతున్నాడట. ఇప్పటికే వీరి కాంబినేషన్లో పలు సినిమాలు వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయి అన్న విషయం తెలిసిందే. మిరపకాయ్, నేనింతే లాంటి సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇక ఇప్పుడు వీరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది.



 అయితే ఈ సినిమా ఒక బాలీవుడ్ సినిమాకు రీమేక్ అంటూ టాలీవుడ్ లో ప్రచారం ఊపందుకుంది  అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయం బయటకు వచ్చిన రవితేజ ఫాన్స్ అందరు కూడా తెలుసుకోవాలని ఆసక్తిని కనబరుస్తున్నారు. కాగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించిన రైడ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారట. ఇక ఈ సినిమా వీరి కాంబినేషన్లోనే తెరకెక్కుతుందట. అయితే ఈ విషయంపై మాత్రం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: