పాన్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ మళ్ళీ తన ఆట మొదలెట్టారు. ఇక థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ అంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఈసారి ఖచ్చితంగా ఆయన అభిమానులకు మజానే అట. సూపర్‌స్టార్ రజనీకాంత్ కు దేశావ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మాస్ ఫాలోయింగ్ ఉంది.ఆయన సినిమాల కోసం అందరూ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అలాంటిది ఈ మధ్య రజనీకాంత్ చిత్రాలు మాత్రం ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి.దీంతో ఆయన స్టామినా తగ్గిందనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది.ఇంకా చెప్పాలంటే రజనీకాంత్ నటిస్తున్న 'జైలర్' సినిమాకి బిజినెస్ పెద్దగా ఊపు లేదనే మాట కూడా వినిపిస్తోంది. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, తమన్నా, రమ్యకష్ణ, యోగిబాబు ఇంకా వసంత రవి లాంటి ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తుండగా, సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న 'జైలర్' సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఆగస్టు 10 వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
ఈ సినిమాలో రజనీకాంత్, ముత్తువేల్ పాండియన్ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటించారు. ఇందులో రజనీకాంత్ గెటప్, టైటిల్ లాంటివి రిలీజ్ చేసినా కూడా గతంలో లాగా ఆశించిన మూమెంట్ రాలేదు. మరోవైపు ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర నిర్మాణ సంస్థ ప్రచారం అస్త్రాలు ప్రయోగించడానికి రెడీ అయ్యింది.ఈ మధ్య జైలర్ నుంచి 'కావాలయ్యా' పాటను విడుదల చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాని ఇది బాగా ఊపేస్తోంది. తమన్నా అందాలారబోత ఇంకా అనిరుధ్ బీట్స్ దెబ్బకు పాట బాగా వైరల్ అయిపోయింది. ఈ స్పీడ్ లో హుకుమ్ టైగర్ కా హుకుమ్ అనే మరో మాస్ పాటను విడుదల చేయబోతున్నారు. జూలై 17న విడుదల చేయనున్నట్లు సూపర్ స్టార్ రజనీకాంత్ ఫొటోతో పోస్టర్‌ను విడుదల చేశారు. ఇది సృష్టించే సంచలనం కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా భారీ స్థాయిలో ఈ నెల 28 వ తేదీన జరగనుందని సమాచారం తెలుస్తుంది.