ఏంటి బేబీ మూవీ కథ.. డైరెక్టర్ రియల్ స్టోరీనా?

praveen
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబీ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. జూలై 14 వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్  టాక్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది.  ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది అని చెప్పాలీ. అంతేకాదు ఇక బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కూడా రాబడుతుంది. ఇలా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అయింది అని చెప్పాలి.


 అయితే ఇటీవల కాలం లో ఇలా సక్సెస్ అయిన సినిమాలకి చిత్ర బంధం థాంక్స్ మీట్ ఏర్పాటు చేయడం సర్వసాధారణం గా మారి పోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఈ సక్సెస్ మీట్ లో ఇటీవల డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను బయట పెట్టాడు. సాధారణం గా అయితే నేను చకచక పరిగెడుతూ స్క్రిప్ట్ పూర్తి చేస్తూ ఉంటాను. కానీ బేబీ కథ రాసేటప్పుడు మాత్రం ఈ కథని పాత్రని మెల్లిగానే చూపించాలని నిర్ణయించుకున్నాను.



 కానీ స్లో నేరేషన్ తో సినిమా తీస్తే ఆడుతుందో లేదో అని అనుకున్నాను. కానీ ప్రేక్షకులు మాత్రం ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తున్నారని.. కొంత మంది తిట్టేవాళ్ళు తిడుతున్నారు.. పొగిడే వాళ్ళు పొగుడుతున్నారు. కానీ నేను అన్నింటినీ కూడా స్వీకరిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే 20 ఏళ్ల క్రితం నేను కూడా ప్రేమించాను. 8 నెలలు నేను నరకం అనుభవించాను. ఆ బాధను తెలియ జేయాలని ఈ కథను రాసుకున్నాను. నేను వైష్ణవి కోణం లో రాయలేదు. ఆనంద్ కోణం లోంచి కథ రాసుకున్నానని చెప్పుకొచ్చాడు. నా తొలిప్రేమ సక్సెస్ కానీ ఆ బాధ మాత్రం నాకు తెలుసు. ఆ బాధ ఎలా ఉంటుందో చూపించాలని అనుకున్నానని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: