2025 వరకు శ్రీలీల చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలుసా..?
ఇక పూజా హెగ్డే, రష్మిక వంటి అగ్ర హీరోయిన్లనే కాకుండా యంగ్ హీరోయిన్ల క్రేజ్ అమాంతం తగ్గిపోయేలా చేసింది శ్రీలీల. వీరి సినిమా అవకాశాలను కూడా ఈమె దక్కించుకోవడమే కాకుండా వీరి రిజెక్ట్ చేసిన సినిమాలకు కూడా తన డేట్లు అడ్జస్ట్ చేస్తూ ఆ సినిమాలను కూడా ఒప్పుకుంటోంది .ముఖ్యంగా మొదటి ఛాయస్ అయినా సరే రీప్లేస్మెంట్ అయినా సరే ఈమెకు సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. దీంతో దాదాపుగా 2025 వరకు ఈ అమ్మడు చేతి లో 15 సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది ఈ సినిమాలన్నీ కూడా థియేటర్లో రిలీజ్ తో సందడి చేయబోతోంది. దాదాపుగా అందరు స్టార్ హీరోలతో కూడా నటిస్తోంది శ్రీ లీల.
శ్రీ లీల సీనియర్ హీరోలకు కూతురు పాత్రలో కూడా నటించేందుకు సిద్ధమయ్యింది. ముఖ్యంగా ఈ అమ్మడు అందం డాన్స్ ఫిజిక్కుకు సైతం కుర్రకారులు ఫిదా అయ్యారని చెప్పవచ్చు. అందుకే వచ్చిన అవకాశాన్నల్లా సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించేలా ప్లాన్ చేసుకుంటోంది శ్రీ లీల. ఏదిఏమైనా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలో ఈ కుర్ర హీరోయిన్ కి ఇన్ని అవకాశాలు రావడంతో సీనియర్ హీరోయిన్లు సైతం ముక్కున వేలు వేసుకుంటున్నారు.