ఎట్టకేలకు గేమ్ చేంజర్ సినిమా నుండి బిగ్ అప్డేట్ ఇచ్చిన శంకర్..!?

Anilkumar
మెగా అభిమానులు ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ పై తీవ్రస్థాయిలో కోపంగా ఉన్నారు అని చెప్పాలి. అందరూ హీరోల సినిమాల కు సంబంధించిన అప్డేట్లు వరుస పెట్టి వస్తూ ఉంటే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ మాత్రం రాకపోవడంతో మెగా అభిమానులు శంకర్ పై తీవ్రస్థాయిలో గురువుగా ఉన్నారు. పైగా ఇండియన్ టు సినిమాని తొందరగా పూర్తి చేయాలని తపనతో శంకర్ ఉన్నట్లుగా తలుస్తోంది. ఈ క్రమంలోనే గేమ్ చేంజెస్ సినిమాను పట్టించుకోవడంలేదని మెగా అభిమానులు వాపోతున్నారు. అయితే దానికి తోడుగా గత రెండు మూడు రోజులుగా


 ఈ ప్రాజెక్టులోకి హిట్ సిరీస్ దర్శకుడు శైలేష్ కొలను వచ్చాడన్న వార్తలు రావడంతో ఈ సినిమాపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కేవలం శైలజ సెకండ్ యూనిట్ కి సంబంధించిన వ్యవహారాలు మాత్రమే చూసుకుంటున్నాడని అది కూడా శంకర్ పర్యవేక్షణలోనే అని తెలియగానే కాస్త శాంతించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి ఒక అప్డేట్ ను విడుదల చేశారు చిత్ర బృందం. అయితే భారీ ఫైట్ సీక్వెన్స్ తెరకెక్కించేందుకు రెడీ అయినట్లుగా తమ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు చిత్ర బృందం.


ఇకపోతే బుధవారం నుండి ఈ సినిమా మేజర్ షెడ్యూల్ ప్రారంభం కాబోతుందని అన్నారు. అంతే కాదు వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ని పూర్తి చేసి వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్ నేపథ్యంలో వస్తున్నాయి. ఈ సినిమాకి పిజ్జా జిగర్తాండ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తీసిన కార్తీక్ సుబ్బరాజు కథను అందించడం జరిగింది. అయితే రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ కి జోడిగా కియారా అద్వానీ మరియు అంజలి నటిస్తున్నారు. కాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్నాడు. వారితోపాటు సునీల్ ఎస్ జె సూర్య ఇటువంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: