నెటిజన్ చేసిన పనికి నవ్వుకున్న స్టార్ హీరోయిన్ రష్మిక...!!
అభిమానులు తనను చూసి ఫోటోలు దిగడం కోసం ఎగబడితే ఈమె ఏ మాత్రం వారిని దూరం పెట్టకుండా వారితో కలిసి ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపుతారు. ఇలా రష్మికకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే తాజాగా ఇలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ పనులలో బిజీగా ఉన్నటువంటి రష్మికతో సెల్ఫీలు దిగడం కోసం కొందరు ఆమె ఉన్నటువంటి కేరవాన్ దగ్గరికి వచ్చారు.అయితే ఆమెతో ఫోటోలు దిగడం కోసం వచ్చారని తెలుసుకొని కేరవాన్ నుంచి రష్మిక బయటకు వచ్చారు.
ఇలా అందరూ తనతో కలిసి ఫోటోలు దిగుతూ ఉండగా ఓ అభిమాని మాత్రం తన ఫోన్ సరిగా పట్టుకోకపోవడంతో రష్మిక ఆ అభిమాని ఫోన్ తీసుకొని కరెక్ట్ గా పట్టుకోమని చెబుతుంది. అయితే అంతలోనే ఆ అభిమాని రష్మిక నుంచి తన ఫోన్ చాలా బలంగా లాగేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయినటువంటి రష్మిక దాన్నుంచి వెంటనే తేరుకుని నవ్వుతూ రియాక్ట్ అయ్యింది. మరో అభిమానికి ఫోటో ఇచ్చింది. ఈ ఫన్నీ సన్నివేశాన్ని క్యాప్చర్ చేసిన అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఇప్పుడు అది నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈమె పుష్ప 2, యానిమల్, రెయిన్ బో వంటి సినిమాలో షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.