మహేష్ సినిమా తర్వాత రాజమౌళి మెగా ప్లాన్..!
మహేష్ కూడా అందుకు రెడీ అన్నట్టు టాక్. ఇదిలాఉంటే రాజమౌళి మహేష్ సినిమా తర్వాత మహా భారతం సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. అప్పట్లో మహా భారతం సినిమా చేయడానికి తనకు ఇంకా అంత ధైర్యం రాలేదని.. అది తన రిటైర్ అయ్యే టైం కి తీస్తానని చెప్పారు రాజమౌళి. కానీ ఇప్పుడు మహేష్ సినిమా పూర్తి చేశాక మహా భారతం నే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. అఫ్కోర్స్ అలా చేయాలన్నా కూడా మరో ఐదేళ్లు పట్టే అవకాశం ఉందనుకోండి.
రాజమౌళి మహా భారతంలో టాలీవుడ్ స్టార్ హీరోలంతా కూడా ఉంటారని తెలుస్తుంది. ముఖ్యంగా ఎన్.టి.ఆర్, రాం చరణ్, మహేష్, ప్రభాస్ లు ఈ సినిమాలో భాగం అవుతారని తెలుస్తుంది. మహా భారతం మాత్రం ఒకటి రెండు భాగాలుగా కాకుండా ఒక్కో హీరోతో ఒక్కో భాగం చేస్తూ పెద్ద మెగా ప్లానింగ్ తోనే ఉన్నాడు రాజమౌళి. మొత్తానికి జక్కన్న ప్లానింగ్ చూస్తుంటే టాలీవుడ్ పేరు మరోసారి హాలీవుడ్ రేంజ్ లో వరల్డ్ మొత్తం మాట్లాడుకునేలా చేస్తారని చెప్పొచ్చు. రాజమౌళి ప్లాన్ వేశాడు అంటే ఆ ప్లాన్ కి తిరుగు ఉండదంతే.. సో రాజమౌళి కమింగ్ సినిమాలన్నీ ఒక్కొక్కటి ఒక్కో ట్రెండ్ సెట్టర్ మూవీ అవుతుందని చెప్పొచ్చు.