నన్ను యాంకర్ గా తప్పిస్తారని.. ముందే తెలుసు?
అయితే కొన్నిరోజులు రెండు షోలు చేసాక జబర్దస్త్ కి కొత్త యాంకర్ ని తెచ్చారు. ఆమెనే సౌమ్యరావు. అప్పటివరకు సౌమ్యరావు గురించి ఎవ్వరికి తెలీదనే చెప్పాలి. సౌమ్యరావు రావడంతో రష్మీ మల్లి ఎక్స్ట్రా జబర్దస్త్ కి వెళ్ళిపోయింది. సౌమ్య జబర్దస్ కి యాంకరింగ్ చేస్తుంది. తాజాగా రష్మీ నెటిజన్లతో ఇంటరాక్ట్ అయ్యింది. ఇందులో ఒక నెటిజెన్ ‘జబర్దస్త్’ యాంకర్ గా మిమ్మల్ని తీసేసి సౌమ్యరావును తీసుకురావడంపై మీ స్పందన ఏంటి? అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు రష్మీ ఓపెన్ గా కామెంట్స్ చెప్పింది. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ‘జబర్దస్త్’ యాంకర్ గా ఉండేది కొన్ని వారాలే అని ముందే చెప్పారు. కొత్త యాంకర్ వచ్చాక వెళ్లిపోవాలని అప్పుడే అన్నారు. దీంతో తనకేమి ఇబ్బంది లేదని రష్మీ చెప్పింది. ఈ షో నుంచి వెళ్లిపోతానని ముందే తెలుసని చెప్పింది. అలాంటప్పుడు నాకు ఎందుకు అభ్యంతరాలు ఉంటాయి?” అని వెల్లడించింది. యాంకర్ గానే కాదు సినిమాల్లో కూడా ట్రై చేసున్న అని చెప్పుకొచ్చింది.