సుమ స్థానానికి పొంచి ఉన్న ప్రమాదం ?
అయితే అలాంటి సుమకు ఆమె కెరియర్ రీత్యా ప్రమాదం పొంచి ఉందా అంటూ ప్రస్తుతం కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం లేటెస్ట్ గా భాగ్ సాలే యూనిట్ తో బండ్ల గణేష్ చేసిన ఇంటర్యూను చూసిన వారు ఈకామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే నటుడుగా నిర్మాతగా రాజకీయ వేత్తగా అనేక అవతారాలు ఎత్తిన బండ్ల గణేష్ యాంకర్ గా మారి చేసిన ఈ ఇంటర్యూ చాలామందికి నచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు అడుగుతూనే తనదైన స్టయిల్ లో పంచ్ లు వేసి మధ్యలో వేదాంతం చెపుతూ కొటేషన్స్ కూడ చెప్పిన బండ్ల గణేష్ ను చూసిన వారికి సుమకు అతడు పోటీ అవుతాడు అంటూ జోక్ చేస్తున్నారు. ప్రస్తుతం చాలామంది హీరోలు యాంకర్లుగా మారుతున్న విషయం తెలిసిందే. హీరో గోపీ చంద్ సిద్ధు జొన్నలగడ్డ యాంకర్లుగా మారి ఇంటర్వ్యూలు చేస్తే ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ప్రమోషన్ టైమ్ లో అనీల్ రావిపూడి సందీప్ రెడ్డి వంగ యాంకర్లుగా మారిపోయిన విషయం తెలిసిందే. అంతేకాదు గోపీచంద్ మలినేని బాబి లాంటి దర్శకులు కూడా యాంకర్లుగా మారి షాక్ ఇస్తున్నారు.
‘రావణాసుర’ మూవీ ప్రమోషన్ సమయంలో రవితేజాను హరీష్ శంకర్ ఇంటర్వ్యూ చేసి అందర్నీ మెప్పించాడు. ఆఖరికి ఈ లిస్టులో ప్రభాస్ కూడ చేరిపోయి పూరి జగన్నాధ్ కొడుకును ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. ఇక నాని గురించి ఎంత చెప్పినా తక్కువే. నాని యాంకర్ గా చాల చక్కగా రాణిస్తున్నాడు. ఇలా అనేకమంది ఫిలిమ్ సెలెబ్రెటీలు యాంకర్లుగా మారిపోవడంతో యాంకర్ సుమకు రానున్నది కష్టకాలం అంటూ జోక్స్ పడుతున్నాయి..