HBD: ధోని-సాక్షి మధ్య బంధం ఎలా ఏర్పడిందో తెలుసా..?

Divya
క్రికెట్ అభిమానులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మహేంద్రసింగ్ ధోని అభిమానులు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు టీమ్ ఇండియాకు క్రికెట్ అందించిన ఒక గొప్ప నాయకుడుగా పేరు పొందారు దాదాపుగా 16 ఏళ్లు టీం ఇండియాకు విశేషమైన సేవలు అందించిన ధోని క్రికెట్ కూడా రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది.కెప్టెన్ మిస్టర్ కూల్ గా మంచి పాపులారిటీ సంపాదించారు. అయితే ధోని లైఫ్ లో కూడా ఒక క్యూట్ లవ్ స్టోరీ ఉన్నది. వాటి గురించి తెలుసుకుందాం.


ధోని భార్య సాక్షి సింగ్ తోనే ఈ లవ్ ఉన్నట్లు తెలుస్తోంది. సాక్షి కోసం ధోని ఎన్నో తిప్పలు పడ్డాడట.ధోని బర్తడే సందర్భంగా వీరిద్దరి లవ్ స్టోరీ గురించి కొన్ని వార్తలు వైరల్ గా మారుతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.. అయితే ధోని బయోపిక్ ఆధారంగా ధోని ది అంటోల్డ్ స్టోరీ అనే బయోపిక్ లో ధోనీకి సాక్షి సింగిల్ కి మధ్య పరిచయం అనుకోకుండా జరిగిందని చూపించారు.. అయితే వీరిద్దరూ చిన్ననాటి నుంచి స్నేహితులట.. ఈ విషయం ఒకరికొకరి తెలుసని తెలుస్తోంది.


సాక్షి తండ్రి ధోని తండ్రి ఒకే రాంచీలో ఒకే కంపెనీలో పనిచేసేవారట. ఇరువురు కుటుంబాల మధ్య రాకపోకలు కూడా ఉండేవట .దీంతో ఈ జంట ఒకే స్కూల్లో కూడా చదువుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకు సాక్షి కుటుంబం డెహ్రాడూన్ కు మారిపోయింది. సాక్షి సింగ్ తన చదువును కూడా డెహ్రాడూన్ లోనే పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత ఔరంగాబాద్ హోటల్లో మేనేజ్మెంట్ చదువుతున్న సాక్షి దాదాపుగా పదేళ్ల తర్వాత ధోని కోల్కత్తాలోని తాజ్ బెంగాల్ హోటల్లో కలవడం జరిగిందట.


ఆ సమయంలో టీమిండియా ఈడెన్ గార్డెన్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడుతోందని తన మొదటి చూపుతోనే సాక్షి అందానికి మాటలకు పడిపోయిన ధోని తాజ్ బెంగాల్ మేనేజర్ నుంచి ఆమె నెంబర్ తీసుకుని ఆమెకు మెసేజ్ పంపించారట. అయితే ఆ మెసేజ్లను ధోని పెద్దగా పట్టించుకోలేదని మేనేజరే ఫ్రాంక్ చేస్తున్నాడేమో అని భావించిందట కానీ ఆ తర్వాత రెండు నెలలకు సాక్షి ధోని పుట్టినరోజు వేడుకలకు హాజరైంది. ఆమెను తన బైక్ పైన ఇంటికి తీసుకువెళ్లే సమయంలో ధోని తన లవ్ మ్యాటర్ చెప్పారట ఆ తర్వాత ప్రేమను అంగీకరించడానికి చాలా సమయం పట్టిందట. చివరికి జులై 4- 2017 కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

HBD

సంబంధిత వార్తలు: