పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న తాజా సినిమా సలార్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ను ఇవాళ ఉదయం 5:12 నిమిషాలకు రిలీజ్ చేశారు చిత్ర బృందం. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగానే టీజర్ ఒక రేంజ్ లో ఉంది అని మురిసిపోతున్నారు ప్రభాస్ అభిమానులు. భారీ పంచ్ టాక్స్ డైలాగ్స్ లేకపోయినప్పటికీ హీరోని పూర్తిగా చూపించలేకపోయినప్పటికీ ఒక నిమిషం 46 సెకండ్ల నిడివే గల ఈ సినిమా టీజర్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నయ్.
కేజిఎఫ్ సిరీస్ తరహాలోనే ఈ సినిమాని కూడా చూపించడం దర్శకుడు హీరో చేత ఒక్క డైలాగ్ కూడా చూపించలేదు. కానీ అతని ఎంట్రీ మాత్రం చాలా పవర్ ఫుల్ గా చూపించాడు దర్శకుడు. అచ్చం ఇలాంటి హీరో ఎంట్రీని కేజిఎఫ్ 2 సినిమాలో సైతం చూపించాడు దర్శకుడు. అక్కడ 'హిస్టరీ టెల్స్ అజ్ ద పవర్‌ఫుల్ పీపుల్ కమ్స్ ఫ్రం పవర్‌పుల్ ప్లేసెస్. బట్ హిస్టర్ వాజ్ రాంగ్. పవర్ ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ ఫుల్'అంటూ ఓ వ్యక్తి వాయిస్ ఓవర్‌తో హీరో పరిచయం ఉంటుంది. ఇప్పుడు సలార్‌లోనూ అలాంటి ఇంగ్లీష్ డైలాగ్‌తోనే ప్రభాస్ ఇంట్రడక్షన్స్ చెప్పించారు.
'లయన్, చీతా, టైగర్, ఎలిఫెంట్.. వెరీ డేంజరస్.. బట్ నాట్ ఇన్ జురాసిక్ పార్క్, బికాజ్ ఇన్ దట్ పార్క్.. 'అంటూ హీరోని ఎలివేట్ చేస్తూ టీజర్ సాగుతుంది. అయితే కేజీఎఫ్ సినిమా గోల్డ్ మైన్స్ లో సాగితే సలార్ సినిమా బొగ్గు గనుల నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. అయితే కేజిఎఫ్ సినిమా లాగానే ఈ సినిమా రెండు భాగాలుగా తరికి కాబోతోంది. కాగా ఇందులో పార్ట్ వన్ కి సీజ్ ఫైర్ అనే ట్యాగ్ లైన్ ని ఇవ్వడం జరిగింది. ఇక దీనికి అర్థం ఏంటి అంటే రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు గానీ హింసాత్మక సంఘటనలు జరిగినప్పుడు గానీ శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం సీస్ ఫైర్. కాగా రెండవ ప్రపంచ యుద్ధంలో మొదటిసారి ఈ పదాన్ని వాడడం మనం గమనించవచ్చు.. కాగా ఈ టీజర్ లో ప్రభాస్ ఎంత వైల్డ్ గా కనిపించడం మనం చూడొచ్చు..!!