మంచు మనోజ్ అలా చేయడం మోహన్ బాబు కి ఇష్టం లేదా..!?

Anilkumar
మంచు మోహన్ బాబు వారసుడిగా బిందాస్ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు మంచు మనోజ్. మొదటి సినిమాతో  హిట్ కొట్టిన తర్వాత వరుస సినిమాల అవకాశాలు రావడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు మంచు మనోజ్. కొన్ని సినిమాలో హిట్ అయినప్పటికీ మరికొన్ని సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. దాంతో ఆయన సినిమాలకి పూర్తిగా దూరమయ్యాడు. అనంతరం వ్యక్తిగతంగా కూడా బాగా డిస్టర్బ్ అవ్వడంతో సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చాడు మంచు మనోజ్. తాజాగా ఇప్పుడు మళ్లీ వాట్ ధ ఫ్రెష్ అని ఒక క్రేజీ సినిమాతో మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉన్నాడు ఈ యంగ్ హీరో.


 ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది. ఈ క్రమంలోనే మంచు మనోజ్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే మంచు మనోజ్ ఒక సినిమాలో విలన్ పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక అది కూడా మాస్ మహారాజా రవితేజ సినిమాలో కావడం ఇక్కడ విశేషంగా మారింది. కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ మరియు రవితేజ కాంబినేషన్లో  ఒక సినిమా రాబోతోంది. ఇక ఆ సినిమాలో విలన్ గా చేస్తున్నడట మంచు మనోజ్. ఈ క్రమంలోనే మంచు మనోజ్ విలన్ గా అయితే చాలా బాగుంటాడని అంటున్నారు ప్రేక్షకులు.


ఎందుకంటే మోహన్ బాబు ఎంత మంచి మంచి సినిమాలు చేశారో మనకి తెలిసిందే. అందులో కొన్ని సినిమాలలో ఆయన విలన్ గా కూడా మెప్పించాడు ఈ క్రమంలోనే మంచు మనోజ్ సైతం విలన్ గా నటిస్తే బావుంటుందని అంటున్నారు. సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అంటే హీరో గానే కాకుండా అప్పుడప్పుడు విలన్ పాత్రలు కూడా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. అంతేకాదు ఇండస్ట్రీలో ఎదగాలంటే ఎప్పుడు ఒకేలా కాకుండా విభిన్నమైన పాత్రలు చేస్తే ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని అన్ని విధాలుగా ప్రేక్షకులను మెప్పిస్తేనే స్టార్ హీరోగా ఎదుగుదలమని అంటున్నారు. ఇక మనోజ్ ఇలా విలన్ పాత్రలు చేయడం మోహన్ బాబు కి ఇష్టమా లేదా అన్న చర్చలు సైతం జరుగుతున్నాయట..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: