ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ సలార్ టీజర్ రానే వచ్చింది. ఆయన అభిమానులు కోరుకున్న స్టఫ్ ఇందులో పుష్కలంగా ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ టీజర్ లో కేవలం యాక్షన్ సన్నివేశాలను మాత్రమే చూపించాడు ప్రశాంత్ నీల్. దాంతోపాటు ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో చూపించే ప్రయత్నం సైతం చేశాడునటుడు. టిల్లు ఆనంద్ ఎలివేషన్స్ ఇస్తుంటే ప్రభాస్ మరో ప్రక్క ఊచ కోత కోస్తున్నాడు. ప్రభాస్ సలార్ టీజర్ దాదాపు రెండు నిమిషాలు ఉంది.
అయినప్పటికీ టీజర్ లో సినిమాకి సంబంధించిన ఎటువంటి అప్డేట్ ను ఇవ్వలేదు దర్శకుడు. సినిమా ఎలా ఉంటుంది అన్నది చెప్పలేదు. కానీ ఈ సినిమాలో హీరో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి అన్నది మాత్రం చూపించాడు దర్శకుడు. ఇంకా గతంలో వచ్చిన కే జి ఎఫ్ రాఖీ భాయ్ ఎలివేషన్స్ చూస్తే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇప్పుడు ప్రభాస్ నీ సలార్లో సైతం అదే తరహాలో చూపించాడు ప్రశాంత్. అయితే తాజాగా విడుదలైన ఈ టీజర్ లో మొదట పులి, సింహం, ఏనుగు అడవిలో డేంజరస్ కానీ జురాసిక్ పార్క్ లో కాదని చెప్పడం బాగుంది.అయితే సలార్ క్యారెక్టర్ ని జురాసిక్ పార్క్ లో డైనోసర్ తో పోల్చాడు ప్రశాంత్ నీల్. అంటే తిరుగులేని డేంజరస్ వేటగాడిని చెప్పాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ సినిమా కూడా గతంలో వచ్చిన కే జి ఎఫ్ కదలానే ఉంటుందా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు కేజిఎఫ్ లో రాఖి భాయ్ మరణించిన తర్వాత సలార్గా ఉద్భవిస్తాడని ప్రచారం జరుగుతుంది. అయితే ప్రభాస్ సలహాలు సినిమాని ఉదయం 5:12 నిమిషాలకి విడుదల చేయడానికి గల ముఖ్య కారణం కూడా ఇదే అని అంటున్నారు. ఎందుకు అంటే కేజిఎఫ్ సినిమాలో రాఖీ భాయ్ పై గోల్డ్ షిప్ పై అదే సమయంలో దాడి జరుగుతుంది. అందుకే అదే సమయంలో టీజర్ ని సైతం విడుదల చేశారని అంటున్నారు అని అంటున్నారు. అంతేకాదు దానికి సంబంధించిన ట్లు ఈ సినిమాలో ఉంటుందని అంటున్నారు. కానీ టీజర్ లో మాత్రం అటువంటివి ఏమీ కూడా కనిపించడం లేదు..!!