దగ్గుబాటి హీరో రానా ప్రస్తుతం సినిమాలకి బ్రేక్ ఇచ్చినట్లుగా వార్తలు వినపడుతున్నాయి. అయితే గతంలో కొంచెం కూడా బ్రేక్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేవారు రానా. కానీ ఇప్పుడు కాస్త స్పీడ్ తగ్గించారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మొన్న ఆ మధ్య విరాటపర్వం సినిమాతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు రానా. దాని తర్వాత తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో మెరిసాడు. ఇక ఈ వెబ్ సిరీస్ విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ మంచి టాప్ను తెచ్చుకుంది. అయితే తాజాగా ఇప్పుడు ఆయన మరొక క్రేజీ ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడు అన్న వార్తలు వినబడుతున్నాయి.
గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్య కాశ్యప సినిమా చేయాల్సి ఉంది. గతంలో ఈ సినిమా ఉంటుందన్న వార్తలు వచ్చాయి. అయితే కానీ ఇప్పుడు దాని వార్త ఎక్కడా వినబడడం లేదు. అయితే గుణశేఖర్ తెరకెక్కించిన శకుంతలం సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గా మిగిలిందిమ్ దాంతో గుణశేఖర్ ఇప్పుడు ఒక డైలమాలో పడ్డారు అని అంటున్నారు. దాంతో హిరణ్య కర్షపా ఆగిపోయింది అన్న వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఇప్పుడు తేజ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు రానా. అయితే ఇటీవల తేజ రానా తమ్ముడు అభిరాంతో కలిసి అహింస అనే సినిమాను చేశాడు.
ఇక ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. తాజాగా ఇప్పుడు రానాతో కలిసి రాక్షస రాజు అనే సినిమాను చేస్తున్నాడట తేజ.. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూఉంది. గతంలో తేజ మరియు రానా కాంబినేషన్లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. తాజాగా ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లు వచే రాక్షస రాజా సినిమా సైతం అదే స్థాయిలో విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నారు వారి అభిమానులు. చూడాలి మరి ఈ సినిమా కూడా నేనే రాజు నేనే మంత్రి సినిమా అంత విజయాన్ని సొంతం చేసుకుంటుందో లేదా అన్నది..!!