ఈ మూడు మూవీలకు హిట్ టాక్ వస్తే ఇక అంతే..?

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుండి మూడు భారీ సినిమాలు విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలకు కనక హిట్ టాక్ వస్తే అదిరిపోయి రేంజ్ కలెక్షన్ లను వసులు చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఆ సినిమాలు ఏవి ... అవి ఏ తేదీలలో విడుదల కాబోతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

జవాన్ : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన ఈ మూవీ లో నయన తార హీరోయిన్ గా నటించగా ... కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో ఒకరు అయినటు వంటి అట్లీ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో ప్రియమణి ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ని సెప్టెంబర్ 7 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ ,  హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి కనక బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ వచ్చినట్లయితే అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

సలార్ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 28 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ ,  మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ వచ్చినట్లు అయితే అదిరిపోయే రేంజ్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

లియో : తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... లోకేష్ కనకరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను అక్టోబర్ 19 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి కూడా హిట్ టాక్ వస్తే భారీ కలెక్షన్ లను వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: