పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె సినిమా చేస్తున్నాడు ప్రభాస్. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమని విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు ఈ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ సినిమాలో కమలహాసన్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.
అయితే ఏ విధంగా కమలహాసన్ సినిమాలో నటించబోతున్నారని ఈ సినిమాలో కమలహాసన్ పాత్ర ఎలా ఉండబోతుందని అందులో ఇలా నటించబోతున్నారని ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది. అయితే తాజాగా ఈ సినిమాలో కమలహాసన్ ఎలాంటి పాత్రలో నటించబోతున్నారు అన్న వార్త సోషల్ మీడియాలో షికార్లు చేస్తోంది. అయితే ప్రాజెక్ట్ కె సినిమాలో ప్రభాస్ ని ఢీకొట్టబోయే పాత్రలో కమల్ హాసన్ పాత్ర ఉంటుందట. అంతే కదు అత్యంత భయానకంగా కమలహాసన్ పాత్ర ఈ సినిమాలో ఉండబోతుందని తెలుస్తోంది. ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని పిచ్చి
కోరికతో అత్యంత స్వార్థపరుడుగా క్రోరుడిగా కమల్ హాసన్ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. కలియుగం ఎలా అంతమవుతుంది ఎవరివల్ల అంతమవుతుంది అనేది ఎప్పటినుండో ప్రచారంలో ఉన్న మాటే. అయితే తాజాగా ఇప్పుడు అదే ఒక వ్యక్తి స్వార్థానికి ప్రపంచం ఎలా అంతమవుతుంది అన్న విషయాన్ని ఈ సినిమా డైరెక్టర్ కమలహాసన్ ద్వారా ఈ సినిమాలో చూపించబోతాడట. అయితే ఈ విధంగా కమలహాసన్ ఈ సినిమాలో పూర్తిగా నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కమలహాసన్ లుక్ ఈ సినిమాలో ఏ విధంగా దర్శకుడు చూపించబోతున్నారని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్..!!