లోక నాయకుడు కమలహాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తన నటన ప్రతిపతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోసాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నో ఫిలింఫేర్ అవార్డ్స్ లతో పాటు పద్మభూషణ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను సైతం అందుకున్నాడు కమలహాసన్. ఇంత వయసు వచ్చినప్పటికీ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు కమలహాసన్. అయితే ఇటీవల విక్రం సినిమాలో నటించి భారీ విజయాన్ని అందుకున్నాడు కమలహాసన్.
లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఈ సినిమా ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా ఇప్పుడు కమలహాసన్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అది ఏంటంటే తాజాగా కమలహాసన్ మరోక ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రారన్నట్లుగా తెలుస్తోంది. కమల్ హాసన్ ఇప్పటివరకు 233 సినిమాలను చేశారు. తాజాగా ఇప్పుడు ఆయన కెరియర్లో 234వ సినిమాగా మరొక కొత్త సినిమా రాబోతుంది. అయితే తాజాగా ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు చిత్ర బృందం.
హెచ్ వినోద దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. అయితే తాజాగా ఎందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు మూవీ మేకర్స్. అండ్ ఇట్ బికెన్స్ రైస్ టు రూల్ అంటూ కమలహాసన్ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు. దాంతో ఈ వార్త విన్న కమలహాసన్ అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ టు సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా గతంలో వచ్చిన ఇండియన్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ సినిమా తర్వాత కమలహాసన్ వినోద్ దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో కమలహాసన్ కొత్త సినిమాకి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!