హన్సికపై షాకింగ్ కామెంట్స్ చేసిన రోబో శంకర్.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్..!
అసలు విషయంలోకి వెళితే.. హన్సిక కాళ్ళను తాకాల్సిన సీన్ ఒకటి పార్ట్నర్ చిత్రంలో ఉంది. కానీ ఆ సీన్ చేసేటప్పుడు నేను హన్సిక కాలినే కాదు బొటనవేలు తాకడానికి కూడా ఆమె ఒప్పుకోలేదు.. అదే సమయంలో ఇదే సినిమా హీరో ఆదికి మాత్రం తన కాలు తాకడానికి అనుమతించిందని.. హీరోగా ఉండడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆ స్పీచ్ లో వెల్లడించారు రోబో శంకర్.. అయితే అదే సందర్భంలో హన్సిక కాస్త అతడి వ్యాఖ్యలతో కలత చెందగా.. రోబో శంకర్ మాత్రం తన కామెంట్స్ ను చాలా జోవియల్ గా తీసుకోవాలని తెలిపారు.
ఇకపోతే ఇదే కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్టు కూడా శంకర్ తన లిమిట్స్ క్రాస్ చేశారని తెలుపగా.. ఈ మేరకు పార్టనర్ మూవీ చిత్రం అలాగే రోబో శంకర్ తరఫున హన్సికకు క్షమాపణలు తెలిపింది. కానీ టీం నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన సోషల్ మీడియాలో విడుదల కాలేదు. ఇకపోతే ఈ సినిమాలో రవి మారియా, టైగర్ తంగదురై, పాన్ విజయ్, పాలక్ లాల్వాని , యోగి బాబు, పాండేరాజన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.