"రంగబలి" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ... వేదిక ఖరారు..!

frame "రంగబలి" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ... వేదిక ఖరారు..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య ఆఖరుగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన పాలానా అబ్బాయి పలానా అమ్మాయి అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇది వరకే నాగ శౌర్య అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో ఊహలు గుసగుసలాడే ... జ్యో అచ్యుతానంద అనే రెండు విజయవంతమైన సినిమాలు రూపొందడంతో పలానా అబ్బాయి పలానా అమ్మాయి మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు పెట్టుకున్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించ లేక పోయింది.
 


ఇలా తాజాగా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మూవీ తో ప్రేక్షకులను నిరాశ పరిచిన ఈ యువ హీరో తాజాగా రంగబలి అనే సినిమాలో హీరోగా నటించాడు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఈ మూవీ ని సుధాకర్ చెరుకూరి నిర్మించగా ... పవన్ బాసం శెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని జూలై 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన తేదీ మరియు వేదికను ఖరారు చేస్తూ అప్డేట్ ను ఇచ్చింది.


రంగబలి మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను జూలై 1 వ తేదీన వెస్టిన్ హోటల్ ... మైండ్ స్కేప్ ... హైదరాబాదులో సాయంత్రం 6 గంటలకు ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: