మరోసారి అలాంటి వివాదంలో చిక్కుకున్న రష్మి..!?

Anilkumar
బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేనే పేరు రష్మి గౌతమ్. జబర్దస్త్ షోలో యాంకర్ గా తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈమె. యాంకరింగ్ తో పాటు అడపాదడ పాటు సినిమాల్లో కూడా నటిస్తూ తన గ్లామర్ ని చూపిస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే రష్మీ గౌతమ్ జంతు ప్రేమికురాలు అనే సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. మూగజీవాలను హింసిస్తే అసలు సహించదు రష్మీ వాటిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఆక్టివ్ గా ఉంటుంది రష్మీ. అయితే ఒక్కోసారి జంతు ప్రేమికురాలిగా ఆమె చేసే పోస్ట్ లు మిస్సయిర్ అవుతూ ఉండడం మనం చూసే ఉంటాం. అయితే దాంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది రష్మీ. 


అయితే తాజాగా అలాంటిదే మరొక పోస్ట్ చేసి వివాదంలో చిక్కుకుంది రేష్మి. అయితే బక్రీద్ సందర్భంగా రష్మీ ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది. అందరినీ తిడుతూ ఆమె చేసిన పోస్ట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో నేటిజెన్ల నుండి విమర్శలకు గురవుతోంది రష్మీ. ప్రతి పండుగ సందర్భంగా రష్మీ ఇలాంటి పోస్టులను చేస్తూ ఉండడం మనం గమనించవచ్చు. జంతువులను హింసించి బలిచ్చే ఆచారాలపై మండిపడుతూ పోస్ట్లను చేస్తూ ఉంటుంది ఆమె. అయితే తాజాగా అలాంటి ఒక పోస్ట్ చేసింది రష్మీ ఈ క్రమంలోనే రష్మీ పెట్టిన పోస్ట్ పై రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజెన్స్. 


ఎందుకు ప్రతిసారి పండగల సమయంలోనే జంతువుల మీద నీకు అంత ప్రేమ అంటూ ఒక వ్యక్తి చెప్పుకొచ్చాడు.. పెద్దపెద్ద కంపెనీలు నాన్ వెజ్ లో వెరైటీలను చేస్తూ పెద్ద స్టార్స్ తో పబ్లిసిటీ చేస్తూ ఉంటారు.. వాళ్ళని ఏం అడగవా అంటూ రష్మీ పై మండిపడ్డాడు.. అంతేకాదు హైదరాబాదులో వీధి కుక్కల దాడిలో ఒక చిన్నారి మృతి చెందాడు ఆ ఘటన అందరినీ కలిసివేసింది.. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.. చాలామంది దానిపై స్పందించారు.. ఇక దానికి రష్మీ కూడా స్పందిస్తూ అందులో కుక్కలు తప్పేముంది అంటూ చెప్పుకొచ్చింది దీంతో రష్మీ ని విపరీతంగా ట్రోల్ చేశారు..!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: