ఆ తేదీ నుండి "ఓటిటి" లో "విమానం" మూవీ..!

Pulgam Srinivas
తమిళ సినిమాల ద్వారా నటుడిగా అద్భుతమైన గుర్తింపును తెచ్చుకున్న వారిలో సముద్ర కని ఒకరు. ఈయన కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలకు దర్శకత్వం కూడా వహించి దర్శకుడిగా కూడా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో సముద్ర ఖని తెలుగులో కూడా అనేక సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితమే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సర్కారు వారి పాట సినిమాలో విలన్ పాత్రలో నటించాడు.


అలాగే రామ్ చరణ్ ... జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ లో మాత్రమే కాకుండా ఇప్పటి వరకు సముద్రకని అనేక తెలుగు సినిమాలలో ఎన్నో ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈయన పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ హీరోలుగా రూపొందిన "బ్రో" అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. బ్రో మూవీని జూలై 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే సముద్రఖని "విమానం" అనే సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాలో అనసూయ ... రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు.


శివ ప్రసాద్ యానాల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి ప్రేక్షకులను పర్వాలేదు అని రేంజ్ లో అలరించింది. ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పర్వాలేదు అనే రేంజ్ లో అలరించిన ఈ సినిమా ఈ నెల 30 వ తేదీ నుండి జీ 5 "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: