రామ్ చరణ్,బుచ్చిబాబు సినిమాపై షాకింగ్ అప్డేట్..!?

Anilkumar
త్రిబుల్ ఆర్ సినిమా ఘన విజయం తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే ఈమధ్య తండ్రి కావడంతో ప్రస్తుతం ఆయన పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేసే పనిలో ఉన్నాడు. కొన్ని రోజులు కుటుంబంతోనే సమయం కేటాయించాలని భావించి ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చాడు రామ్ చరణ్ దాంతో ఈయన మళ్ళీ తిరిగి షూటింగ్స్ కి రావడానికి కొంత సమయం పడుతుందని తెలుస్తోంది. అయితే ఇదే సరైన సమయం అని ఈ టైం ని పూర్తిగా వాడుకుంటున్నాడు డైరెక్టర్ శంకర్. అయితే ఆ మధ్య చరణ్ కమలహాసన్ సినిమాలు ఒకేసారి చేశాడు శంకర్.

 అయితే తాజాగా ఇప్పుడు ఈ సమయాన్ని ఇండియన్ టు సినిమా కోసం కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇక రాంచరణ్ తిరిగి షూటింగ్స్ కి వచ్చేలోపు కమలహాసన్ సినిమాని పూర్తి చేయాలని ప్లాన్ చేశాడు దర్శకుడు శంకర్. అయితే అన్ని అనుకున్నట్లుగానే జరిగితే ఆగస్టు వరకు ఇండియన్ 2 సినిమా పూర్తి చేసే అవకాశాలు కూడా ఉన్నాయట. అయితే ఈ సినిమా డిసెంబర్ లేదా సంక్రాంతి కానుకగా విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. దాని తర్వాత చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడు శంకర్. ఇక చరణ్ తిరిగి వచ్చిన తర్వాత ఈ సినిమా షూటింగ్ని ఆగస్టు నుండి మళ్లీ ప్రారంభించి నవంబర్ లోపు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు.

దాని తర్వాత బుచ్చిబాబు సినిమాతో బిజీ కాబోతున్నాడు చరణ్.ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి. పీరియాడికల్ బ్యాక్ గ్రౌండ్ లో సాగే స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాని తీస్తున్నాడు బుచ్చిబాబు. అయితే ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. స్వాతంత్రానికి పూర్వం జరిగే కథతో ఈ సినిమా రాబోతోందట. అంతే కాదు రంగస్థలం సినిమాను మించి  ఈ సినిమా ఉండబోతుందని అంటున్నారు. కాగా ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించబోతున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వృద్ధి సినిమా సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక డిసెంబర్ నుండి ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి 2024 దసరా కానుకగా విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయట. ఒకవేళ అప్పుడు వర్కౌట్ కాకపోతే 2025 సంక్రాంతికి ఈ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయట..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: