ప్రాజెక్ట్ -k గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తమ్మారెడ్డి....!!
ఇంద్ర సినిమాకు 30 కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తే మీ రేంజ్ కు 100 కోట్ల రూపాయలు రావాలని చిరంజీవితో అన్నానని తమ్మారెడ్డి తెలిపారు. తెలుగులో 100 కోట్ల రూపాయల కలెక్షన్లు ఎలా వస్తాయని అనిపించిందని ఆయన చెప్పుకొచ్చారు. బాహుబలి2 సినిమాతో 1000 కోట్లు సులువుగా సాధించవచ్చని రాజమౌళి ప్రూవ్ చేశారని తమ్మారెడ్డి అన్నారు. మనం వరల్డ్ రికార్డ్ సినిమా లెవెల్ కు వెళ్లాలని ఆయన పేర్కొన్నారు.ఫ్లాప్ సినిమాలు కూడా 100 కోట్ల కలెక్షన్లు సాధిస్తున్నాయని తమ్మారెడ్డి తెలిపారు. ప్రాజెక్ట్ కే సినిమాను సరిగ్గా ప్రొజెక్ట్ చేస్తే వరల్డ్ టాప్ సినిమాలలో ఈ సినిమా చేరుతుందని ఆయన అన్నారు. ఈ సినిమా సెట్స్ కు వెళ్లానని ఈ సినిమా గ్లోబల్ గా రికార్డ్స్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉందని తమ్మారెడ్డి పేర్కొన్నారు. ఈ సినిమా తప్పితే మహేష్ రాజమౌళి సినిమా ఆ రికార్డ్ సాధిస్తుందని ఆయన అన్నారు.10,000 కోట్లు, 20,000 కోట్ల రూపాయల రేంజ్ లో ఈ సినిమాలు కలెక్షన్లను సాధించాలని తమ్మారెడ్డి తెలిపారు. సరిగ్గా ప్రమోషన్స్ చేస్తే ప్రాజెక్ట్ కే సినిమా తొలిరోజే 500 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.