ప్రాజెక్ట్ కె ను వెంటాడుతున్న ఆదిపురుష్ భయాలు !

Seetha Sailaja
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ ఒక సైంటిఫిక్ ఫ్యాంటసీ మూవీ ఈసినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈసినిమా పై నిర్మాతలు పెడుతున్న ఖర్చు ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. లేటెస్ట్ గా ఈమూవీలో నెగిటివ్ క్యారెక్టర్ ను విలక్షణ నటుడు కమలహాసన్ పోషిస్తున్నట్లుగా వచ్చిన వార్తలు అందరికీ షాక్ ఇచ్చింది.


అంతేకాదు ఈమూవీలో కమల్ నెగిటివ్ పాత్ర చేయడానికి అత్యంత భారీ పారితోషికం డిమాండ్ చేసినట్లు టాక్. ఇప్పటికే ఈమూవీలో నటిస్తున్న ప్రభాస్ కు 100 కోట్ల పారితోషికం ఇస్తున్నట్లు వార్తల హడావిడి జరుగుతోంది. ఇదే మూవీలో అంతాబ్ దీపికా పదుకొనె లు కూడ నటిస్తున్న పరిస్థితులలో ఈమూవీలో నటిస్తున్న నటీనటుల పారితోషికాలకు 200 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


అంతేకాకుండా ఈమూవీకి చాలామంది హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. దీనితోపాటు ఈమూవీ గ్రాఫిక్ వర్క్స్ పై కూడ అత్యంత భారీ స్థాయిలో నిర్మాత ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఖర్చు అంతా కలుపుకుంటే ఈమూవీ ప్రాజెక్ట్ సుమారు 6 వందల కోట్ల స్థాయికి చేరుకుంటుందని ఒక అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ప్రభాస్ సినిమాలకు ప్రస్తుతం భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి కానీ ఆసినిమాలు నిలబడలేకపోతున్నాయి.


లేటెస్ట్ గా భారీ అంచనాలతో విడుదలైన ‘ఆదిపురుష్’ మూవీ నాల్గవ రోజు వచ్చే సరికి ఆసినిమాకు వచ్చిన టాక్ రీత్యా ఘోరంగా కలక్షన్స్ పడిపోయి ప్రస్తుతం టిక్కెట్ ధర తగ్గించే స్థాయికి చేరుకుంది. ఒకసారి సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిన తరువాత ఆమూవీ టిక్కెట్ ధర తగ్గినప్పటికీ ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య ‘ప్రాజెక్ట్ కె’ విషయంలో నాగ్ అశ్విన్ తో పాటు ఆమూవీ నిర్మాతలు సాహసం చేస్తున్నారా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వస్తున్నాయి. సెప్టెంబర్ లో విడుదలయ్యే ‘సలార్’ మూవీ పరిస్థితి పట్టి ‘ప్రాజెక్ట్ కె’ మార్కెట్ పరిస్థితి ఆధారపడి ఉంటుంది అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు..      


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: