నా స్కిన్ కలర్ పై.. దారుణంగా మాట్లాడారు : ప్రియమణి
ఒకవైపు సీనియర్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా ఛాన్స్ దక్కించుకుంటూనే మరోవైపు సినిమాల్లో వైవిద్యమైన పాత్రలు చేస్తూ అదరగొడుతుంది. ఇక వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ తనకు తిరుగులేదు అని నిరూపిస్తుందిఈ ముద్దుగుమ్మ. అయితే తన కెరియర్ మొదట్లో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను అంటూ ప్రియమణి చెప్పుకొచ్చింది అన్న విషయం తెలిసిందే. ఆంటీల ఉన్నావ్ అంటూ ఎంతోమంది హేళన చేసేవారు అంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ఇక ఇటీవల తన చేదు అనుభవాల గురించి తాజా ఇంటర్వ్యూలో మరోసారి చెప్పింది.
తన స్కిన్ కలర్ గురించి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను అంటూ ప్రియమణి తెలిపింది. బాడీ షేమింగ్ శరీర రంగు విషయంలో ఇప్పటికీ కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న. ముస్తఫా తో పెళ్లికి ముందు మా నిశ్చితార్థ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తే.. నా స్కిన్ కలర్ పై ఎంతోమంది దారుణంగా ట్రోల్ చేశారు. ముస్లిం వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అంటూ ఎంతోమంది ప్రశ్నించారు. అయితే ఎన్ని విమర్శలు వచ్చిన తాను పట్టించుకోనని.. తన పనిలో తాను ఎప్పుడూ బిజీగా ఉంటాను అంటూ ప్రియమని చెప్పుకొచ్చింది.