నేను హీరోయిన్ అవుతానని.. అస్సలు ఊహించలేదు?
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య మీనన్ తన కెరీర్ గురించి స్పై సినిమా గురించి కూడా ఎన్నో ఆసక్తికర విషయం అభిమానులతో పంచుకుంది. స్పై సినిమాలోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కోసం నేను ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. గన్ సరిగ్గా పట్టుకోవడం, షూటింగ్ ఇలా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. అంతేకాదు ప్రేమ కథలే కాదు యాక్షన్ సన్నివేశాలు కూడా నేను బాగా నటించగలను అనే విషయం ఈ సినిమాతో నాకు అర్థమైంది. ఈ సినిమా నాలో మరింత కాన్ఫిడెన్స్ ని పెంచింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత కథ రహస్యం ఆధారంగా అనేది సినిమా బేస్ లైన్ కానీ డ్రామా వేరుగా ఉంటుంది అంటూ ఐశ్వర్య చెప్పుకొచ్చింది.
ఇక ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం డైరెక్టర్ గ్యారి నన్నే అనుకున్నారట. ఇక దీంతో ఆయన స్ట్రైట్ గా వచ్చి నాకు కథ వినిపించారు. నేను చూసిన తొలి తెలుగు సినిమా హ్యాపీ డేస్. అలాగే నిఖిల్ చేసిన కార్తికేయ, స్వామి రారా సినిమాలను కూడా చూశాను. ఇక ఈ కథ నచ్చడంతో వెంటనే ఓకే చేసాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే నేను హీరోయిన్ అవుతానని అస్సలు ఊహించలేదు. నేను ఒక ఇంజనీర్ ని.. నా బ్రదర్ డాక్టర్.. స్టార్టింగ్ లో కొన్ని యాడ్స్ చేశాను. తర్వాత మెల్ల మెల్లగా ఒక్క అడుగు వేసుకుంటూ ఇప్పుడు హీరోయిన్ గా మారాను. నా ప్రయాణం ఎంతో హ్యాపీగా ఉంది ఐశ్వర్య మీనన్ చెప్పుకొచ్చింది. కాగా స్పై సినిమా ఈ నెల 29వ తేదీన విడుదల కానుంది.