మహేష్ బాబు ఆధి పత్యంలో గుంటూరు కారం ?

Seetha Sailaja
రాజమౌళి ఇండస్ట్రీలో అందరిచేత గౌరవం పొందే దర్శకుల లిస్టులో త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రధమ స్థానంలో ఉంటాడు. రచయితగా స్క్రీన్ ప్లే రైటర్ గా సంభాషణల రచయితగా అన్నీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగల శక్తి అతడికి ఉండటంతో అతడితో సినిమాలు చేయడానికి చాలామంది హీరోలు ఆసక్తి కనపరిచినప్పటికీ త్రివిక్రమ్ మాత్రం తాను గతంలో దర్శకత్వం వహించిన టాప్ హీరోలతో మళ్ళీమళ్ళీ సినిమాలు తీయడానికి ఇష్టపడుతూ ఉంటాడు.


‘అల వైకుంఠ పురములో’ మూవీ బ్లాక్ బష్టర్ హిట్ తరువాత త్రివిక్రమ్ మహేష్ తో తీస్తున్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’ మూవీ పై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే ఈ సినిమా కథకు సంబంధించి ఆధిపత్యం అంతా మహేష్ బాబు ఇష్టప్రకారమే జరుగుతోంది అన్న గాసిప్పులు వస్తున్నాయి.


ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథను మూడుసార్లు మహేష్ సూచనలకు అనుగుణంగా త్రివిక్రమ్ మార్చాడు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇక ఈ మూవీ సంగీత దర్శకుడుగా తమన్ వద్దనీ మహేష్ వాడిస్తే ఎంతో కష్టపడి తమన్ ను ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా త్రివిక్రమ్ ఒప్పించాడు అన్న ప్రచారం కూడ ఉంది.


లేటెస్ట్ గా పూజా హెగ్డే విషయంలో కూడ త్రివిక్రమ్ మాట చెల్లుబాటుకాలేదు అని అంటున్నారు. మొదట్లో ఆమెను మెయిన్ హీరోయిన్ గా శ్రీలీల ను సెకండ్ హీరోయిన్ గా త్రివిక్రమ్ మొదట్లో అనుకున్నాడట. అయితే ఈ మూవీ కథలో వచ్చిన మార్పులతో శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా మారిపోవడంతో త్రివిక్రమ్ కు పూర్తిగా ఇష్టం లేకపోయినా మహేష్ ఒత్తిడితో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ స్థానం నుండి తప్పుకోవలసి  అన్న ప్రచారాం జరుగుతోంది. దీనితో ఈమూవీ అంతా మహేష్ ఆధిపథ్యంలోనే జరుగుతోంది అంటూ ఇండస్ట్రీలో గాసిప్పుల హడావిడి జరుగుతోంది. దీనితో టాప్ హీరోల ముందు టాప్ దర్శకుల మాటకు కూడ విలువ లేకుండా పోతోంది అంటూ కొందరు కమెంట్స్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: