ఆదిపురుష్ కి నెగిటివ్ టాక్.. అయినా ప్రభాస్ అరుదైన రికార్డ్?

praveen
ప్రస్తుతం టాలీవుడ్ హీరో ప్రభాస్ ఏ రేంజ్ లో క్రేజ్ సంపాదించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకుల రెబల్ స్టార్ గా సినీ ప్రేక్షకులందరికీ డార్లింగ్ గా కొనసాగిన ప్రభాస్ అటు రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన బాహుబలి సినిమా తర్వాత.. మాత్రం గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. దీంతో ప్రభాస్ సినిమా వస్తుందంటే కేవలం టాలీవుడ్ లోనే కాదు అటు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు అందరూ ఎదురుచూసే విధంగా తన హవా నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే బాహుబలి సినిమా తర్వాత వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న భారీ సినిమాల్లోనే నటిస్తూ ఉన్నాడు ప్రభాస్.

 అయితే బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎంతో మంది దర్శకులు ఇక ప్రభాస్ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అంతా బాగానే ఉంది కానీ ఎందుకో బాహుబలి తర్వాత సరైన హిట్టు మాత్రం కొట్టలేకపోతున్నాడు ప్రభాస్. సాహో, రాధేశ్యామ్ లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా ఈ సినిమాలు పెద్దగా ప్రేక్షకుల ఆదరణ నేర్చుకోలేదు. అయితే ఇటీవల రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఆది పురుష్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ సినిమా కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇలా కలెక్షన్స్ విషయంలో ఒక అరుదైన రికార్డు సృష్టించాడు ప్రభాస్. టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ నటించిన సినిమాలు తెలుగులో కంటే హిందీలో బాగా ప్రేక్షకాదరణ పొందుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ నటించిన వరుసగా నాలుగు మూవీలు హిందీలో 100 కోట్ల నెట్ వసూళ్లు సాధించాయ్. దీంతో ఈ రికార్డు సాధించిన తొలి సౌత్ హీరోగా నిలిచాడు ప్రభాస్. బాహుబలి, సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ సినిమాలు ఒక్కో మూవీ వరుసగా 100 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టాయి. ఇలా సౌత్ నుంచి వెళ్లి నార్త్ లో ఈ రేంజ్ కలెక్షన్స్ రావట్టిన తొలి హీరోగా నిలిచాడు ప్రభాస్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: