బోయపాటి పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదే కారణమా..!?

Anilkumar
టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్లలో పవన్ కళ్యాణ్ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ కూడా ఒకటి అనడంలో ఎటువంటి సందేహం లేదు.వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రావాలని ఎప్పటినుండో కోరుకుంటున్నారు  ఫాన్స్. అయితే పవన్ కళ్యాణ్ ని అప్పట్లో అభిమానులు పక్క ఊరమా సినిమాలో చూడాలని ఆశపడ్డారు ఇక అదే సమయంలో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది అప్పటివరకు సినీ ఇండస్ట్రీలో ఉన్న రికార్డ్ ఇండస్ట్రీ హిట్ గా  ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక దీని తర్వాత పవన్ కళ్యాణ్ వెంటనే డివివి దానయ్య ఎంటర్టైన్మెంట్స్ లో ఒక సినిమా చేసేందుకు అడ్వాన్స్ని తీసుకున్నాడు. 


ఇక ఆ  సమయంలో బోయపాటి శ్రీను వద్ద మంచి స్క్రిప్ట్ ఉందని తెలిసి ఈ సంస్థ బోయపాటి శ్రీను ని పిలిచి ఆ కథని పవన్ కళ్యాణ్ తో చేయించాలని ఏర్పాట్లు సైతం చేశారు. ఇక బోయపాటి మరియు పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో కథను కూడా వినిపించారు. కానీ పవన్ కళ్యాణ్ కి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఆ కద లేదని ..కొన్ని మార్పులు చేసుకుని మళ్లీ చెప్పండి.. అంటూ కోరాడట పవన్ కళ్యాణ్ .ఇక బోయపాటి సైతం పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులను చూసి మరొకసారి పవన్ కళ్యాణ్ కి వినిపించాడు.. కానీ ఎందుకో పవన్ కళ్యాణ్ కి మళ్ళీ ఆ కథ నచ్చలేదు.. సినిమా ఓవర్ మాస్ కద అనిపించడంతో పవన్ ఈ సినిమాని రిజెక్ట్ చేశాడు.


తన నిర్ణయం తర్వాత చెప్తాను అని బోయపాటికి తెలియజేశారు. ఇక ఆ సమయంలోనే పూరి జగన్నాథ్ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాని ఓకే చేశారు పవన్ కళ్యాణ్. ఇక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ముందు పవన్ కళ్యాణ్ బోయపాటి శ్రీనుకి ఫోన్ చేసి మీరు నాకు చెప్పిన కద నాకు చాలా నచ్చింది.. కానీ ఎందుకో అలాంటి కద నాకు సెట్ కాదని అనిపిస్తుంది . ఈ కథ బాలయ్యకి చెప్తే బాగుంటుంది.. ఈ కథ ఆయనకి సరిగ్గా సరిపోతుంది ...అంటూ సలహా ఇచ్చారట. నాకు తగ్గ కథ తీసుకుని రండి మీ దర్శకత్వంలో కచ్చితంగా సినిమా చేయాలని కోరుకుంటున్నాను అంటూ తెలియజేశారు పవన్ కళ్యాణ్ ..దీంతో వీరి కాంబినేషన్ ఇప్పటి వరకు సెట్ అవ్వలేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: