కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎప్పటికప్పుడు ఏదో రకంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాడు. మరీ ముఖ్యంగా మన దగ్గర కొందరు నెటిజన్స్ విజయ్ ని తెగ ట్రోల్స్ చేస్తుంటారు. ఇక పోతే ఇప్పుడు విజయ్ హీరోగా నటిస్తున్న ఓ మూవీ కోసం ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.అలాగే తెలుగు ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. దానికి కారణం లోకేష్ కనగరాజ్. ఈయన పేరుకే తమిళ డైరెక్టర్. కానీ తెలుగులో కూడా తన సినిమాలతో సూపర్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.అందుకు 'ఖైదీ', 'విక్రమ్' సినిమాలే కారణం.. ఈ రెండు సినిమాలని లింక్ చేస్తూ LCU (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) సృష్టించాడు. ఇప్పుడు విజయ్ తో చేస్తున్న 'లియో' సినిమా కూడా ఇందులో భాగమేనని అంటున్నారు. విజయ్ పుట్టినరోజు సందర్భంగా లియో మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.ఇక ఈ పోస్టర్ లో విజయ్ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్నట్లు చూపించారు. వెనక మంచు కొండలు, ఓ తోడేలు, ఓ వ్యక్తి ఊడిన పళ్లు, చేతిలో సుత్తి ఇంకా దానితో పాటు గాల్లో రక్తం చూస్తుంటే.. విలన్ గ్యాంగ్ మనుషులు విజయ్ పై దాడి చేయడానికి వస్తే వాళ్లని తుక్కురేగ్గొట్టినట్లు ఈ పోస్టర్ లో కనిపిస్తుంది.
గతంలో మూవీ నుంచి ఓ వీడియోని రిలీజ్ చేసినప్పుడు టైటిల్ గోల్డ్ కలర్ లో ఉంది. ఈ ఫస్ట్ లుక్ లో మాత్రం ఆ టైటిల్ రక్తంతో నిండిపోయింది.అయితే విజయ్ తో పాటు ఈ ఫొటోలో ఉన్న పన్ను, రక్తంతో ఉన్న చేయి సంతానం(విజయ్ సేతుపతి) దే అని క్లియర్ గా తెలుస్తోంది.ఈ పోస్టర్ కి అభిమానుల నుంచి ఊహించని రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది. ఈ పోస్టర్ కి ఎన్నో లైకులు, కామెంట్స్ వస్తున్నాయి.విక్రమ్ లో సంతానం పాత్రని గుర్తుచేసుకుంటే ఖచ్చితంగా క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా స్పష్టత రావాలంటే మాత్రం ట్రైలర్ వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి వైరల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. ఈ సంవత్సరం అక్టోబరు 19న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక ప్రస్తుతం తెలుగు హక్కుల కోసం భారీ డిమాండ్ నెలకొంది. దాదాపు రూ.27 కోట్ల దాకా రైట్స్ పలుకుతున్నాయని అంటున్నారు.