ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేసిన రాంచరణ్ ఉపాసన దంపతులు....!!

frame ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేసిన రాంచరణ్ ఉపాసన దంపతులు....!!

murali krishna
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తాజా గా రామ్ చరణ్, ఉపాసన దంపతులకు మొదటి బిడ్డ గా అమ్మాయి జన్మించడం తో ఇండస్ట్రీ లో ఎప్పటినుంచో కొనసాగుతున్న సెంటిమెంటు మళ్ళీ తెరపైకి వచ్చింది.ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు మొదటి సంతానం గా ఆడపిల్లకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక అలా బాలకృష్ణని మొదలుకొని రామ్ చరణ్ వరకు చాలామంది సెలబ్రిటీలు మొదటి  ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఇక ఆ స్టార్ హీరోల గురించి ఇప్పుడు చూద్దాం.

మెగాస్టార్ చిరంజీవి:మెగాస్టార్ చిరంజీవి , సురేఖ కొణిదెల మొదటి సంతానం గా ఆడపిల్ల జన్మించింది. సుస్మిత జన్మించిన తర్వాత రామ్ చరణ్, శ్రీజలు జన్మించారు.
బాలకృష్ణ: నందమూరి బాలకృష్ణ మొదటి సంతానం గా అమ్మాయి జన్మనిచ్చారు ఆ తర్వాత తేజస్వి , మోక్షజ్ఞలు జన్మించారు.
విక్టరీ వెంకటేష్: విక్టరీ వెంకటేష్ మొదటి సంతానం గా ఆడపిల్ల జన్మించింది. ఆ తర్వాత మరో ఇద్దరు ఆడపిల్లలు, కొడుకు అర్జున్ కి జన్మనిచ్చారు.
మోహన్ బాబు: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కి కూడా లక్ష్మీ ప్రసన్న మొదటి గా జన్మించింది .ఆ తర్వాత మంచు విష్ణు, మనోజ్ కుమారులు జన్మించారు. ఇక వీరిలో లక్ష్మీ ప్రసన్న,         మంచు విష్ణు కి కూడా మొదటి సంతానం గా అమ్మాయిలే జన్మించడం జరిగింది.
రాజశేఖర్:జీవిత, రాజశేఖర్ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించగా.. అందులో మొదటి సంతానం గా ఆడపిల్ల జన్మించింది. ఆ తర్వాత కూడా మళ్లీ ఆడపిల్ల జన్మించిన విషయం తెలిసిందే.
రజినీకాంత్: సూపర్ స్టార్ రజినీకాంత్ కి కూడా ఇద్దరు పిల్లల సంతానం కాగా.. అందులో మొదటి సంతానం గా ఆడపిల్ల జన్మించింది.
కమల్ హాసన్: కోలీవుడ్ స్టార్ హీరో కమలహాసన్ కూడా మొదట ఆడపిల్ల కి జన్మనిచ్చారు.

ఇక వీళ్లే కాకుండా ఇంకా చాలా మంది హీరోల కి మొదట సంతానం గా కూతురు కలిగి ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: