సూర్య కంగువ అలాంటి క్రేజ్ సంపాదించేనా..?

Divya
కోలీవుడ్లో స్టార్ హీరో సూర్య మొదటిసారి ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఆ చిత్రమే కంగువ.. ఈ చిత్రం ఒక పీరియాడికల్ కథ అంశంతో తెరకెక్కించడం జరుగు తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. త్వరలో ఈ సినిమా విడుదల ప్లాన్ చేసే విధంగా చిత్ర బృందం పలు సన్నహాలు చేస్తోంది.అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో కంగువ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమా విషయంలో సూర్య తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.


పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతున్న ప్రతి సినిమా ఎలాగైతే ప్రమోషన్స్ని బాగా చేస్తున్నారు.అలాగే సూర్య కూడా ఈ సినిమాకు అదే రేంజిలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్టూడియో గ్రీన్ యు వి క్రియేషన్ తో కలసి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు . ఈ సినిమాలో హీరోయిన్గా దిశ పటాన్ని నటిస్తున్నది. సూర్య యుద్ధ వీరుడుగా కనిపించబోతున్నారు. బాహుబలి తర్వాత కోలీవుడ్లో విడుదలైన PS -1,PS -2 సినిమాలు వచ్చిన పెద్దగా ప్రభావితం చూపించలేదు దీంతో సూర్య కంగువా సినిమా వర్కౌట్ అవుతుందా అంటూ బాలీవుడ్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి.

సూర్య కెరియర్ లోని ఈ సినిమాని అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరి కంగువ చిత్రంతో సూర్య ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటారో చూడాలి మరి. ఈ సినిమా కథ ఒక విభిన్నమైన కథా అంశంతో తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది. సూర్య చివరిసారిగా జై భీమ్ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు ఈ సినిమా ఓటీటి లో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: