ఆదిపురుష్ సినిమాపై.. సీరియల్ సీత ఏమందో తెలుసా?

praveen
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్ హీరో హీరోయిన్ లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆదిపురుష్. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే 3d టెక్నాలజీ తో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచి కూడా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంటుంది అని చెప్పాలి. అయితే రోజులు గడుస్తున్న కొద్ది ఆదిపురుష్ సినిమాపై నెగెటివిటీ పెరిగిపోతుంది తప్ప ఎక్కడ పాజిటివ్ టాక్ మాత్రం రావడం లేదు. రామాయణాన్ని అపహాస్యం చేసే విధంగా ఆదిపురుష్ సినిమా ఉంది అంటూ ఇక ఎంతోమంది విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు పవిత్రమైన హనుమంతుడి పాత్రతో బూతులు మాట్లాడించడం ఏంటి అంటూ తిట్టిపోస్తున్నారు.

 ఇటీవల శక్తిమాన్ నటుడు ముఖేష్ ఖన్నా సైతం డైరెక్టర్ ఓం రౌత్ కు రామాయణం గురించి కాస్తైన అవగాహన లేదు అంటూ విమర్శలకు గుప్పించాడు. అయితే ఇక తాజాగా రామాయణం సీరియల్ లో సీత పాత్ర పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి దీపిక చిక్లియా ఆదిపురుష్ నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై పురాణ ఇతిహాసాలైనా రామాయణం పై సినిమాలు తీయడం ఆపేయాలి అంటూ విజ్ఞప్తి చేశారు ఆమె. కాగా రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణం సీరియల్ లో ఆమె సీత పాత్ర పోషించారు. ఇంకా నేను ఆదిపురుష్ సినిమా చూడలేదు. కానీ నేను భవిష్యత్తు గురించి మాట్లాడుతున్న.. రామాయణం మన వారసత్వం.

 అందుకే  రామాయణం పై ఇకనుంచి సినిమాలు చేయకూడదనేది నా ఉద్దేశం. రామాయణంపై సినిమా చేసిన ప్రతిసారి ఏదో ఒక వివాదం తెరమీదకి వస్తుంది. రామాయణం మనకి ఎంతో పవిత్రమైనది. ఈ విషయంలో ఎవరిని నొప్పించ కూడదని నేను అనుకుంటున్నాను. మన విశ్వాసాన్ని మనం గౌరవించుకుందాం. రామాయణం అనేది వినోదానికి సంబంధించింది కాదు అంటూ దీపిక కామెంట్ చేసింది. అయితే దీపిక సహనటుడు అరుణ్ గోవిల్ ఆది పురుష్ సినిమాపై కార్టూన్ సినిమా అంటూ దారుణంగా కామెంట్ చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: